Begin typing your search above and press return to search.

ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్

By:  Tupaki Desk   |   8 July 2016 8:49 AM GMT
ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్
X
బస్టాండ్.. రైల్వేస్టేషన్ ఇలా ఎక్కడా ప్రయాణికులకు సౌకర్యాలు కనిపించని పరిస్థితి. కానీ.. విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ లలో అందించే సౌకర్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినఅవసరం ఉండదు. కూల్ కూల్ గా ఉండే ఈ వాతావరణంలో అసౌకర్యం అన్న మాట వినిపించదు. కానీ.. ఎయిర్ పోర్ట్ అంటే ఇంత దారుణంగా ఉంటుందా? అనిపించేలా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన ప్రయాణికులకు ఒక దారుణ అనుభవం ఎదురైంది. ఏసీలు పని చేయటం ఆగిపోవటంతో ఊపిరి ఆడగ.. చెమటల్లో తడిచిపోతే.. కిందామీదా పడిన పరిస్థితి.

గురువారం చోటు చేసుకున్న ఈ ఉదంతంలో వందలాది ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ఇంతకీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి ఏమైందన్న విషయాన్ని చూస్తే.. ఢిల్లీ మెట్రో టెర్మినల్ కు సంబంధించిన ఒక సొరంగ నిర్మాణ పనుల్లో చేస్తున్న సమయంలో.. ఎయిర్ పోర్ట్ ఎయిర్ కండీషనింగ్ కు సంబంధించిన పైపింగ్ వ్యవస్థ దెబ్బ తింది. దీంతో.. గురువారం మధ్యాహ్నం నుంచి ఏసీ పని చేయటం ఆగిపోయింది. దీంతో.. కూలింగ్ మొత్తం తగ్గిపోయి.. వేడి వాతావరణంతో పాటు.. చెమటలతో ప్రయాణికులు తడిచిపోయారు. ఎప్పుడూ ఎదురుకాని ఉక్కపోత అనుభవంతో విమాన ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చారు.