Begin typing your search above and press return to search.
ఏపీలో రోడ్డెక్కిన ప్రగతి రథాలు
By: Tupaki Desk | 21 May 2020 7:50 AM GMTమహమ్మారి వైరస్ ప్రబలి దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు 58 రోజుల పాటు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సులు బయటకు అడుగుపెట్టలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. నాలుగో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణాకు మినహాయింపులు దక్కాయి. దీంతో పల్లె, పట్నంలో ప్రగతి చక్రాలు తిరుగుతున్నాయి. రాష్ట్రమంతటా సేవలు ప్రారంభం కాగా ఒక్క విశాఖపట్టణం, విజయవాడ పట్టణాల్లో మాత్రం సేవలు నిలిపేశారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు నడుస్తున్నాయి.
పూర్తిస్థాయిలో బస్సు సేవలు అందుబాటులోకి రాలేదు. బస్సులన్నింటికీ ఒకేసారి అనుమతులు ఇవ్వలేదు. కేవలం 17 శాతం బస్సులు మాత్రమే రోడ్లపైకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 1,683 బస్సులు తిరిగేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కొన్ని రోజులు పరిశీలించిన అనంతరం మిగతా బస్సులను అనుమతించే అవకాశం ఉంది. ప్రయాణికుల రద్దీ, వైరస్ విజృంభణను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌లో దశలవారీగా సర్వీసులు పెంచే యోచనలో ఉన్నారు.
బస్సుల్లో వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా అమలు చేశారు. బస్సుల్లో కండక్టర్ ఉండరు. బస్టాండ్‌లోనే ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్ తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో టిక్కెట్ తీసుకోలేని వారి కోసం బస్టాండ్లలో కౌంటర్లు కూడా ఏర్పాటుచేశారు. బస్సు ఎక్కేముందు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ముఖానికి మాస్క్ వేసుకోవాలి. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. లేదంటే బస్సు ఎక్కేందుకు అనుమతి లేదు. శానిటైజర్‌ను బస్టాండ్‌ల్లో అందుబాటులో ఉంచారు. మాస్క్‌లు ప్రయాణికులు తెచ్చుకోవాలి.
ప్రస్తుతం తక్కువ సంఖ్యలో బస్సులు కొనసాగుతుండడంతో ఆర్టీసీలో తాత్కాలికంగా రాయితీల్ని తొలగించారు. బస్సు సీటింగ్ కెపాసిటీ తగ్గిపోవడం, బస్సులు కూడా పరిమిత సంఖ్యలో నడుస్తుండడంతో రాయితీల్ని తొలిగించినట్టు ప్రభుత్వం వివరించింది. సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, జర్నలిస్టులకు రాయితీలు ఉండవు. ఎవరైనా ఫుల్ టిక్కెట్ తీసుకోవాల్సిందే. ఈ విధంగా ఆర్టీసీ పటిష్టమైన చర్యలు తీసుకుని సేవలను పునరుద్ధరించింది. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించి ప్రయాణిస్తే అందరికీ క్షేమమని ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ చెబుతోంది.