Begin typing your search above and press return to search.

ఆ ఎయిర్ ఇండియా విమానంలోని 40 మంది క్వారంటైన్..!

By:  Tupaki Desk   |   27 May 2020 4:13 PM GMT
ఆ ఎయిర్ ఇండియా విమానంలోని 40 మంది క్వారంటైన్..!
X
లాక్ డౌన్ నుండి ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో సోమవారం నుండి దేశంలో దేశీయ విమాన ప్రయాణాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజు 39వేల మంది విమానాల్లో ప్రయాణించగా, రెండో రోజు 42వేల మంది ప్రయాణించారు. పలు విమానాలు రద్దయినప్పటికీ సుమారు రెండు రోజుల్లో వెయ్యికిపైగా విమానాలు గాల్లో ఎగిరాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం ఏఐ 91837 ఢిల్లీ-లూధియానా విమానం తన సేవలను కొనసాగిస్తోంది. అయితే, ఢిల్లీ-లూధియానా ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం ప్రయాణించిన ప్రయాణికులకు వైరస్ పాజిటివ్ ఉందని తేలింది. దీనితో 36 మంది ప్రయాణికులతోపాటు నలుగురు విమాన సిబ్బందిని ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌ కు తరలించారు. అలియన్స్ ఎయిర్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ‌కు చెందినవారు టికెట్ కొనుగోలు చేసి మిగితా ప్రయాణికులతోపాటు విమానంలో ప్రయాణించారు. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా ..పంజాబ్ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో 36 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది క్వారంటైన్ లో ఉన్నారని ఎయిరిండియా తెలిపింది.

కాగా, ఇంతకుముందు చెన్నై, కోయంబత్తూరుకు వెళ్లిన విమానంలో ఓ ప్రయాణికుడికి వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో విమాన సిబ్బంది 14 రోజులపాటై క్వారంటైన్లో ఉన్నారు. ఈ విమానంలో ప్రయాణింంచిన ప్రయాణకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా వచ్చిన వ్యక్తిని కోయంబత్తూరులోని ఈఎస్ ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.