Begin typing your search above and press return to search.
రాంచరణ్ విమానాలతో కష్టాలు!!
By: Tupaki Desk | 12 Jan 2016 7:30 AM GMT యంగ్ హీరో రాంచరణ్ తేజ భాగస్వామిగా ఉన్న ట్రూజెట్ విమానయాన సంస్థ ప్రయాణికులకు మరోసారి చుక్కలు చూపించింది. సోమవారం ఉదయం హైదరాబాదు నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఈ విమానాన్ని అకస్మాత్తుగా క్యాన్సిల్ చేసేశారు. దీంతో 70 మంది ప్రయాణికులు అప్పటికప్పుడు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు ట్రూజెట్ విమాన టిక్కెట్లు కొన్న ప్రయాణికులు సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. విమానం బయలుదేరడానికి కొంచెం సమయం ఉందనగా దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు షాకయ్యారు. చివరి నిమిషంలో రద్దు చేయడమేంటంటూ మండిపడ్డారు. అయితే... సాంకేతిక సమస్య కారణంగా రద్దు చేశామని... ఏమీ చేయలేమని ట్రూజెట్ నిర్వాహకులు బదులిచ్చారట. దీంతో 70 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు.
రాంచరణ్ విమానాలు గతంలోనూ ఇలా ప్రయాణికుల సహనాన్ని పరీక్షించాయి. ఈసారి సాంకేతిక సమస్యను కారణంగా చూపించి రద్దు చేశారు. దీంతో ఎక్కడో డొక్కు విమానాలు కొని తెచ్చి వ్యాపారం చేయాలని రాంచరణ్ అనుకుంటున్నారని... అందుకే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని ప్రయాణికులు బహిరంగంగానే ఆరోపించారు.