Begin typing your search above and press return to search.
ఆధార్ పై మరో గుడ్ న్యూస్
By: Tupaki Desk | 2 Sep 2019 8:34 AM GMTదేశవ్యాప్తంగా ఆధార్ కార్డు విశిష్టతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇకపై పాన్ కార్డు స్థానంలో లావాదేవీలు నిర్వహించేందుకు ఆధార్ కార్డును సైతం వాడుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రకటన తర్వాత ఆధార్ కార్డు మరింత శక్తివంతంగా మారింది. ఇక అదే రోజు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నారైలకు కూడా ఆధార్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. ఇక ఇప్పుడు తాజాగా మూడు నెలల్లో భారతీయ పాస్ పోర్టు కలిగిన ఎన్నారైలకూ ఆధార్ కార్డులు జారీ చేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్న గుడ్ న్యూస్ వచ్చేసింది.
కేంద్ర బడ్జెట్ లో ఆరు నెలల్లోగానే ఎన్నారైలకు ఆధార్ కార్డు ఇస్తామని ప్రకటన చేశారు. అయితే అంత టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే మూడు నెలల్లోనే ఈ కార్డులు ఇస్తామని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే సాంకేతిక పరమైన మార్పులు - చేర్పుల ప్రక్రియ నడుస్తోందని చెప్పారు.
ఎన్నారైలకు ఆధార్ కార్డులు జారీ చేసేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత విదేశాల్లో ఉన్న భారతీయులు ఆధార్ కోర్డు జారీ కోసం టైమ్ స్లాట్ లు బుక్ చేసుకునేలా యూఐడీఏఐ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ సంస్థ ఆదార్ నమోదు - జారీ - మార్పులు - చేర్పుల కోసం దేశవ్యాప్తంగా చాలా ఆధార్ సేవ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం ఈ పనులన్నింటిని బ్యాంకులు - పోస్టాఫీసులు - కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతుండడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.