Begin typing your search above and press return to search.
ప్రముఖ నటి పాస్ పోర్ట్ రెన్యువల్ కు తిరస్కరణ
By: Tupaki Desk | 8 Jan 2017 9:48 AM GMTటాలీవుడ్ ను.. కోలీవుడ్ ను ఊపేసిన ఒకప్పటి అగ్రనటి ఖుష్బుకు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆమె పాస్ పోర్ట్ రెన్యువల్ కు అధికారులు నో చెప్పేశారు. కొద్దికాలంగా సినిమాలకుదూరంగా ఉండి.. ఈ మధ్యనే పవన్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ఖుష్బూ.. ఇటీవల కాలంలో రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఆమెపై మూడు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. అందుకే.. ఆమె పాస్ పోర్ట్ రెన్యువల్ కు అధికారులు నో చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. తాను పాస్ పోర్ట్ నురెన్యువల్ కోసం అప్లై చేయలేదని.. తన వరుసప్రయాణాల కారణంగా పాస్ పోర్ట్ బుక్ నిండిపోయిననేపథ్యంలో.. కొత్త పుస్తకం కోసమే తాను దరఖాస్తు చేసినట్లు ఆమె చెబుతున్నారు. అడిషనల్ బుక్ కోసమే తాను అప్లికేషన్ పెట్టుకున్నానని.. తనకు 2022 వరకూ పాస్ పోర్ట్ వాలిడిటీ ఉందని ఆమె చెబుతున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో చోటు చేసుకున్న ఘటనల కారణంగా ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. అయితే.. ఈ కేసులపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చాయని.. అయినప్పటికీ తన పాస్ పోర్ట్ ను పునరుద్దరించకపోవటం అన్యాయంగా ఆమె అభివర్ణిస్తున్నారు. తన పాస్ పోర్ట్ పుస్తకాన్ని ఇవ్వని వైనంపై హైకోర్టును ఆశ్రయిస్తానని ఆమె మండిపడుతున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే అధికారులు ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తమిళనాడు విపక్షమైన డీఎంకేలో ఆమె సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/