Begin typing your search above and press return to search.
ఆ పాస్టర్ ప్రార్థనతో టీమిండియా ఓటమి?
By: Tupaki Desk | 16 July 2019 11:58 AM GMTఇండియా వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఎందుకు ఓడిపోయింది..? ‘‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’’ అనే ప్రశ్న తరువాత భారతదేశాన్ని బుర్ర పగలగొట్టుకునేలా ఆలోచింపజేసిన ప్రశ్న ఇదే. సూపర్ ఫాం.. ఏడో నంబర్ వరకు బ్యాట్స్‌మెన్లే.. టార్గెట్ కూడా తక్కువే.. అయినా, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఇండియా ఓడిపోయింది. దీంతో అభిమానులు ఒకటే రోదనలు. ఎవరికి వారు ఈ ఓటమికి కారణాలు వెతికారు. ధోనీ స్లోగా ఆడడం వల్లే ఓడిపోయారని కొందరంటే.. కాదుకాదు, అంబటి రాయుడు ఉసురు తగలడం వల్ల ఇండియా టీం ఓడిపోయిందని మరికొందరు చెప్పారు. రవిశాస్త్రి రాజకీయాలు.. కోహ్లీకి కోచ్‌కు మధ్య గొడవలు, సంజయ్ బంగార్ చేతకాని తనం.. ఫోర్త్ డౌన్ సమస్యను పరిష్కరించుకోలేకపోవడం వంటి ఎన్నో కారణాలు చెబుతున్నారు. అయితే... ఇవేవీ కారణం కాదని... భారత్ ఓటమికి తానే కారణమని తెలుగువాడైన ఓ క్రైస్తవ ఫాస్టర్ క్లెయిం చేసుకున్నారు. భారత జట్టు ఓటమికి బాధ్యత.. కాదు కాదు.. ఆ ఘనత నాదేనంటూ తన ఫాలోవర్లకు చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఫాస్టర్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో భారీ సభ ప్లాన్ చేశారట. అందుకు ముహూర్తం జులై 14గా నిర్ణయించారు. అయితే... ఆ ఫాలోవర్లంతా ఆయన వద్దకు వచ్చి అదే రోజు వరల్డ్ కప్ ఫైనల్ ఉందని, ఇండియా కనుక ఫైనల్‌కు వెళ్తే మొత్తం ప్రజలంతా టీవీలకు అతుక్కుపోతారని.. అప్పుడు మన సభలకు ఎవరూ రారని చెప్పారట. దీంతో.. ఆయన సెమీఫైనల్లో ఇండియా ఓడిపోవాలని ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థన విని ఇండియాను ఓడించారని చెప్పుకొచ్చారు.
ఫాస్టర్ గారు చెప్పింది ఆయన మాటల్లోనే... ‘‘మా సంఘ పెద్దలు ఒకరోజు నా దగ్గరికి వచ్చి మన యొక్క ఈవెంట్ కరెక్టుగా జూలై 14 వచ్చింది అది ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అండి ఇండియా గనుక ఫైనల్ కి వెళ్తే ఎంతమంది వస్తారో రారో తెలీదు.. రోడ్లన్నీ నిర్మానుష్యమైపోతాయి.. విజయవాడ పట్నంలో రోడ్లమీద స్క్రీన్లు పెట్టి ఆ మ్యాచ్ చూపిస్తారు. సినిమా హాల్స్ లో అంతా కూడా మ్యాచే రన్ అవుతుంది.. ఎలా సార్? అన్నారు. అప్పుడు నేను విశ్వాసంతో ఒక మాట చెప్పాను.. ఇండియా ఫైనల్స్‌కి వెళ్ళదు.. ఇండియా ఫైనల్స్‌కు వెళ్లదు అని చెప్పాను... ఒక విషయం చెప్పమంటారా, వరల్డ్ లో ఇండియన్ టీం గురించి చెప్పాలంటే ద స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ సెవెంత్ డౌన్ వరకు క్రికెట్ ఆడుతారు.. బ్యాటింగ్ ఆడుతారు ఇండియన్ టీం. కానీ 240 పరుగులు ఛేదించలేకపోయారు. ఒక మాట నమ్ముతున్నాను. నిజంగా దేవుడు మన పక్షాన ప్రార్థన విన్నాడు. నిజంగా నేను ప్రార్థన చేశాను. ఇండియా ఫైనల్స్‌కు వెళ్లకూడదు అని ప్రార్థన చేశాను. ఎందుకో తెలుసా.. ఆ రోజు చాలామంది వంటవాళ్లు మేం రాము అంటన్నారు. ఇండియా ఫైనల్స్‌కు వెళ్తే మేం మ్యాచ్ చూడాలి. వంట చేయడానికి మేం రాము అంటున్నారు. అందుకే ప్రార్థన చేశాను. ఇండియా ఓడిపోయింది’’ అని ఆ ఫాస్టర్ చెప్పుకొచ్చారు.
For Video Click Here