Begin typing your search above and press return to search.

పతంజలి డెయిరీ సీఈఓ మృతి .. పతాంజలి మందుల పాత్ర లేదట !

By:  Tupaki Desk   |   25 May 2021 7:30 AM GMT
పతంజలి డెయిరీ సీఈఓ మృతి ..  పతాంజలి మందుల పాత్ర లేదట !
X
యోగా గురు బాబా రాందేవ్కు చెందిన పతంజలి ఆయుర్వేద డైయిరీ సంస్థల సీఈఓ సునీల్ బన్సల్ , కరోనా సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ మే 19న రాజస్థాన్ జైపుర్ లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందారు. అల్లోపతి ఔషధాలపై బాబా రాందేవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమైన క్రమంలో ఆయన మృతి వెలుగులోకి రావడం తో తమ వైద్యవిధానంపై విమర్శలు రాకముందే ముందస్తు జాగ్రత్తగా పతాంజలి స్పందించింది. సునీల్‌కి జరిగిన కొవిడ్‌-19 ట్రీట్‌మెంట్‌లో పతాంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. అలాగే బాబా రాందేవ్ కూడా అల్లోపతి పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.

అయితే , ఆ వెంటనే ఆయన ఐఎంఏకు ఇరవై ఐదు ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు. యాభై ఏడేళ్ల వయసున్న సునీల్‌ బన్సాల్‌ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో సునీల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. ఆయన భార్య రాజస్థాన్‌ ఆరోగ్య విభాగంలో సీనియర్‌ అధికారిగా పని చేస్తున్నారు. ఆమే ఆయన ట్రీట్‌ మెంట్‌ ను దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు జరిగిన అల్లోపతిక్‌ ట్రీట్‌ మెంట్‌ లో పతాంజలి పాత్ర లేదు. కానీ, ఆయన బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశాం అని స్టేట్‌ మెంట్‌ రిలీజ్‌ చేసింది రాజస్థాన్‌ పతాంజలి విభాగం. అయితే ఈ స్టేట్‌ మెంట్‌ రిలీజ్‌ చేయడం ద్వారా పతాంజలి మరోసారి అల్లోపతి వైధ్యవిధానంపై సెటైర్‌ వేసినట్లయ్యింది. డెయిరీ రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన బన్సల్.. 2018లో పతంజలి డెయిరీ బిజినెస్ బాధ్యతలను చేపట్టారు. ఆయన సారథ్యంలో ఈ సంస్థ మంచి ఫలితాలు నమోదు చేసింది.

బాబా రాందేవ్‌-ఐఎంఏ మధ్య కాంట్రవర్సీ నడుస్తున్నవేళ.. హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ట్రీట్‌ మెంట్‌ కోసం లక్ష పతాంజలి కరోనిల్‌ కిట్లను కొనుగోలు చేసింది. ఈమేరకు పతాంజలి ఆయుర్వేద నుంచి కిట్లను కరోనా పేషెంట్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్‌ విజ్‌ ప్రకటించాడు. ఇందుకోసం స‌గం ఖ‌ర్చును పతాంజలి సంస్థ భ‌రిస్తుంద‌ని, మ‌రో స‌గం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంద‌ని మంత్రి అన్నారు.