Begin typing your search above and press return to search.
గంజాయికి రామ్ దేవ్ ‘పతంజలి’ మద్దతు!
By: Tupaki Desk | 10 Feb 2018 10:39 AM GMTఇప్పటికే బ్రిటన్, అమెరికా దేశాల్లో గంజాయి సాగుపై చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అమెరికాలో గంజాయి సాగుకు ప్రభుత్వం పర్మీషన్లు ఇవ్వగా బ్రిటన్ కూడా గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు గంజాయి చట్టబద్ధత చేయాలనే డిమాండ్ భారత్ లో వినిపిస్తోంది.
గంజాయి చట్టబద్ధతపై ఇవ్వాలంటూ ప్రముఖ ఆయర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి మద్దతు పలికింది. గంజాయిని సాగును చట్టబద్ధం చేయాలంటూ రామ్‌దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణ డిమాండ్ చేశారు.
రాజుల కాలంలో గంజాయి ఆకులో ఉన్న పదార్ధాల్ని ఔదష ఉత్పత్తుల తయారీకి వినియోగించేవారిని ...ఇప్పుడు వాటికి చట్టబద్దత కల్పిస్తే తప్పేంటని ప్రశ్నించారు. గంజాయి నూనెలోని విషపూరిత పదార్థాలుగా భావించే టీహెచ్‌సీ వంటి పదార్థాలను వేరుచేసి వినియోగంలోకి తేవచ్చన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హరిద్వార్ లోని పతంజలి పరిశోధన - అభివృద్ధి కేంద్రంలో 200 మంది శాస్త్రవేత్తలు గంజయి ప్రయోజనాలు - వైద్యావసరాలపై పరిశోధనలు జరుపుతున్నారని సూచించారు.
కెనడా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లో గంజాయి వినియోగం - ఆదాయం విస్తృతంగా ఉందన్నారు. అయినప్పటికీ మన దేశంలో మాత్రం చట్ట వ్యతిరేకంగా పరిగణిస్తున్నారన్నారు. గంజాయిని చట్టబద్ధం చేస్తే వ్యాపారభివృద్ధి జరుగుతుందని సూచించారు.