Begin typing your search above and press return to search.
కొత్త చిక్కు:మోడీ ఇలాకాలో ‘పటేళ్ల’ కదం
By: Tupaki Desk | 26 Aug 2015 2:44 AM GMTగుజరాత్ ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. తిరుగులేని అధికారంతో దూసుకెళుతున్న బీజేపీ సర్కారుకు.. బీకాం చదివిన హార్దిక్ పటేల్ కొరకరాని కొయ్యలా మారిన సంగతి తెలిసిందే.
గుజరాత్ లోని పటేల్ కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ఎంతోకాలంగా ఉన్నప్పటికీ..హార్దిక్ పటేల్ సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి పరిస్థితి మొత్తంగా మారిపోయింది. మంగళవారం అహ్మాదాబాద్ లో ఏర్పాటు చేసిన ర్యాలీకి లక్షలాదిగా పటేల్ వర్గీయులు కదం తొక్కటం.. అదే సమయంలో అనుకూల.. వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దీనికి తోడు హార్దిక్ పటేల్ నిరాహార దీక్షకు కూర్చోవటం.. భారీగా ఆందోళకారులు పోటెత్తటతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
ర్యాలీ సందర్భంగా హింసాత్మకంగా సంఘటనలు చోటుచేసుకోవటంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయటంతో పాటు.. భాష్పవాయువు ప్రయోగించారు. పటేల్ వర్గీయుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఓబీసీ జాబితాలోకి మార్చే ప్రసక్తే లేదని.. గుజరాత్ ముఖ్యంత్రి అనందీ పటేల్ తేల్చి చెబుతున్నారు. ఇక.. ఈ అంశంపై నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారటంతో పాటు.. హార్దిక్ పటేల్ చేసిన ప్రసంగంపై వివాదం చెలరేగుతుంది. పటేల్ వర్గీయుల్ని ఓబీసీ జాబితాలోకి చేర్చని పక్షంలో 2017 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తామని చెప్పటమే కాదు.. మోడీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా.. మోడీ ఇలాకాలో పటేల్ ఆందోళన గుజరాత్ సర్కారుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని చెప్పక తప్పదు.