Begin typing your search above and press return to search.
‘పటేల్’పై మాట్లాడి డ్యామేజ్ ఎందుకు పెద్దమనిషి?
By: Tupaki Desk | 6 Nov 2016 5:04 AM GMTకొన్ని విషయాల్ని వీలైనంత తక్కువగా మాట్లాడటం మంచిది. ఎంత మాట్లాడితే అంత డ్యామేజ్. కానీ.. ఆ చిన్న విషయాన్ని తల పండిన మేధావుల్లాంటి నేతలు ఎలా మిస్ అవుతారో అర్థమే కాదు. జాతీయ రాజకీయాల్లో విశేష అనుభవం.. మేధావిగా గుర్తింపు పొందిన మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాటలు వింటే కాస్తంత విస్మయం కలగక మానదు. జనాలకు తెలిసిన విషయాలకు సంబంధించి వారికి తెలీని కోణాన్ని ఆవిష్కరించటం ద్వారా తన మీద ఉన్న గౌరవాన్ని.. మర్యాదను తగ్గించుకునే ప్రోగ్రామ్.. తనకు తానే తెర తీసుకోవటం ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
సర్దార్ పటేల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం దేశ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. ఎవరు ఎంత చెప్పినా.. సర్దార్ పటేల్ కు ఇవ్వాల్సినంత పేరు ప్రఖ్యాతులు.. గౌరవ మర్యాదలు ఇవ్వలేదన్నది పచ్చి నిజం. ఆ విషయంలో కాంగ్రెస్ ఎన్ని చెప్పినా.. వాటిని దేశ ప్రజలు ఎవరూనమ్మటానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ చేసిన తప్పును తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్న మోడీ కారణంగా.. హటాత్తుగా పటేల్ మీద ప్రేమను కుమ్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దన్నుగా మాట్లాడేందుకు జైపాల్ రెడ్డి లాంటి వాళ్లు గళం విప్పటంపై పలువురు తప్పు పడుతున్నారు.
మేధావిగా.. ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరున్న జైపాల్ లాంటి వాళ్లు సర్దార్ పటేల్ విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పుల్ని కప్పి పుచ్చుతూ.. లేనిపోనివి చెప్పే ప్రయత్నం ఆయన స్థాయికి తగ్గవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెహ్రు.. పటేల్ వివాదంపై కాంగ్రెస్.. బీజేపీ నేతలమధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీన్లో తలదూర్చిన జైపాల్ రెడ్డి.. నెహ్రూ.. పటేల్ ఇద్దరూ సమఉజ్జీలైన దిగ్గజాలనీ.. కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లు లాంటి వాళ్లుగా అభిప్రాయపడ్డారు. బీజేపీకి పటేల్ అంటే గౌరవం లేదని.. నెహ్రును తక్కువ చేసేందుకే పటేల్ ను పొగిడేస్తున్నారని చెబుతున్నారు.
కాంగ్రెస్ కు నెహ్రు.. పటేల్ ఇద్దరూ రెండు కళ్లు లాంటి వారని.. హైదరాబాద్ పై నాటి పోలీస్ చర్యలోనూ నెహ్రు.. పటేల్ ఇద్దరూ చర్చించుకున్నాకే కలిసి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఒకవేళ జైపాల్ రెడ్డి చెప్పిందే నిజం అనుకుంటే.. ఒకే ఒక్క ప్రశ్నతో కాంగ్రెస్ పటేల్ కు ఎంత గౌరవం ఇచ్చిందన్న విషయాన్ని ఇట్టే చెప్పేయొచ్చు. పటేల్ మీద కాంగ్రెస్ కు నిజంగానే అంత ప్రేమ ఉంటే.. పట్టుమని నాలుగు పథకాలకు ఆయన పేరుపెట్టటంతోపాటు.. ఆయన జన్మదినాన్ని.. వర్థంతిని ఎందుకు భారీగా నిర్వహించలేదన్నది చెబితే సరిపోతుంది. గతంలో చేసిన తప్పుల్ని వర్తమానంలో సరిదిద్దాలని ప్రయత్నిస్తే.. చరిత్ర చూస్తూ ఊరుకోదన్న సత్యాన్ని జైపాల్ లాంటి పెద్ద మనుషులు ఎందుకు మిస్ అవుతారో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/