Begin typing your search above and press return to search.

పాక్ లో దయనీయ పరిస్థితి..చివరికి లైట్లు కూడా..!

By:  Tupaki Desk   |   7 Jan 2023 12:30 PM GMT
పాక్ లో దయనీయ పరిస్థితి..చివరికి లైట్లు కూడా..!
X
పాకిస్తాన్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారిపోతున్నాయి. చైనాపై అధికంగా ఆధారపడిన శ్రీలంక ఇటీవల ఏ విధంగా అయితే ఆర్థికంగా దివాళా తీసిందో అదే మాదిరిగా అదే రీతిలో పాకిస్తాన్ లోనూ ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. పాకిస్థాన్ కు ఇప్పటికే ఉన్న ఉగ్రవాద సమస్యకు తోడు రాజకీయ అస్థిరత కరోనా ప్రభావం ఆర్థిక మాంద్యం లాంటివి తోడవడంతో అక్కడి పరిస్థితులు దయనీయంగా మారాయి.

చివరికి అమెరికాలోని తమ పాత రాయబార కార్యాలయం సైతం అమ్మేసేంతగా పాక్ లో పరిస్థితులు దిగజారిపోయాయి. అంతేకాకుండా ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కొత్తగా బల్పులు.. ఫ్యాన్ల తయారీని నిలిపి వేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలోనే పాక్ లోని మార్కెట్లన్నీ రాత్రి 8:30 గంటలకే మూసివేసేలా నిర్ణయం తీసుకుంటున్నారు. రాత్రి 10 గంటలకు ఫంక్షన్ హాళ్లు మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటున్నారు. వీటన్నింటి ద్వారా 600 కోట్ల రూపాయలు ఆదా చేయాలని పాక్ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయాన్ని సైతం అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి చైనాపై అధికంగా ఆధారపడిన పాక్ కు కరోనా ప్రభావం భారీగా తగిలింది. గతంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్భణం 42 శాతం పెరిగింది.

గత జూన్లో వచ్చిన వరదలతో పాక్ లోని మూడోవంతు ప్రాంతం మునిగిపోయింది. దీంతో 3వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 5.5 బిలియన్ల విదేశీ నిల్వలు మాత్రమే ఉన్నాయి. వీటితో మూడు నెలలకు సరిపడా దిగుమతులు చేసుకునే అవకాశం ఉండనుంది. ఆ దేశాయి రూపాయి విలువ డాలర్ కు 228 రూపాయలుగా నడుస్తోంది. సాయం కోసం ఐఎంఎఫ్.. సౌదీ అరేబియాల చుట్టూ పాక్ పరుగులు పెడుతోంది. సౌదీ ఇప్పటికే 8 బిలియన్ల సాయం చేసింది.

అయినా పాక్ లో పరిస్థితులు ఏమాత్రం కొలక్కి రావడం లేదు. ఐఎంఎఫ్ 800 కోట్ల డాలర్ల సాయం మంజూరు చేసింది. అయితే బోలెడన్నీ కండిషన్లు పెట్టింది. పన్నులు పెంచాలని సూచించింది. ఇదే జరిగితే అక్కడి ప్రజానీకం మరింత నలిగిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. 2023 జూన్ వరకు అప్పులు.. ఇంధన చెల్లింపులన్నీ కలిపి 30 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా. దీంతో మరోసారి సౌదీనే సాయం కోసం ఆశ్రయించాలని పాక్ చూస్తోంది.

గత ఏఫ్రిల్ లో ఖామ్రాన్ ఖాన్ ను పదవి నుంచి దింపేసిన తర్వాత నుంచి దేశంలో రాజకీయ అనిశ్చిత రాజ్యమేలుతోంది. మరోవైపు పులి మీద పుట్రలా తాలిబన్లు పాక్ సరిహద్దులను ఆక్రమిస్తున్నారు. ఆప్ఘాన్ మాదిరిగానే పాకిస్థాన్ తమ కబంధ హస్తాల్లో తీసుకొని తాలిబన్లు చూస్తుండటంతో ఆ దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.