Begin typing your search above and press return to search.

పెళ్లి పీటలెక్కిన ఉద్యమ నేత

By:  Tupaki Desk   |   28 Jan 2019 11:20 AM GMT
పెళ్లి పీటలెక్కిన ఉద్యమ నేత
X
పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హర్దిక్ పటేల్ ఓ ఇంటి వాడయ్యారు. తన చిన్ననాటి స్నేహితురాలైన కింజల్ పారిఖ్ ను సంప్రదాయబద్ధం వివాహం చేసుకున్నారు. గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లా మౌలిలోని దిగ్సర్ ప్రాంతంలో ఉన్న ఓ గుడిలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ వివాహానికి కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు.

పటీదార్ రిజర్వేషన్ల కోసం గళమెత్తి అప్పట్లో హర్దిక్ పటేల్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పటీదార్ ఉద్యమ నేపథ్యంలో 2016లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. కాగా ఆ సమయంలోనే కింజల్ పారిఖ్ తో హర్ధిక్ పటేల్ నిశ్చితార్థం జరిగింది. హార్దిక్ పటేల్ చెల్లెలి క్లాస్ మేట్ పారిఖ్. తరుచూ హార్ధిక్ ఇంటికి ఆమె వస్తుండేవారు. దీంతో అలా మొదలైన పరిచయం పెళ్లికి దారితీసిందని సన్నిహితులు చెబుతున్నారు.

కింజల్ పారిఖ్ కుటుంబ స్వస్థలం అహ్మదాబాద్ జిల్లాలోని వీరంగ పట్టణం. అయితే కొన్నాళ్ల కిందటే సూరత్ లో సెటిలయ్యారు. వీరంగం టౌన్ కు కొద్దిదూరంలోని చందన్ నగర్ గ్రామానికి చెందిన వాడు హార్దిక్ పటేల్. ఫరిఖ్ కామర్స్ లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసి గాంధీనగర్ లో ఎల్ఎల్ బీ చదువుతున్నారు. హర్దిక్ పటేల్ వయస్సు 25ఏళ్లు కాగా ఆమె అతనికంటే రెండేళ్లు చిన్నది. త్వరలోనే హార్ధిక్ అతిథులు, మిత్రులకు అహ్మదాబాద్ లో విందు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.