Begin typing your search above and press return to search.

గాంధీ ఆస్పత్రిలో మళ్లీ ఉద్రిక్తత!

By:  Tupaki Desk   |   10 Jun 2020 4:05 AM
గాంధీ ఆస్పత్రిలో మళ్లీ ఉద్రిక్తత!
X
తెలంగాణలో కరోనా రోగులకు చికిత్ర కేంద్రంగా ఉన్న హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక రోగి మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అతడి బంధువులు ఆస్పత్రిలోని వైద్యులపై దాడులు చేయడంతో అలజడి చెలరేగింది.

గతంలోనే ఒక రోగి బంధువులు వైద్యులపై దాడి చేయడంతో వైద్యులంతా నిరసన తెలుపడం.. పోలీసులతో మంత్రి ఈటల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం తెలిసిందే. దాడిచేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు.

తాజాగా మరో రోగి చనిపోవడంతో అతడి బంధువులు వైద్యులపై దాడి చేశారు. 55 ఏళ్ల కరోనా రోగి సోమవారం గాంధీలో ప్రాణాలు కోల్పోగా.. అతడి బంధువు ఆగ్రహం పట్టలేక ఓ జూనియర్ డాక్టర్ మీద దాడి చేశాడని జూనియర్ డాక్టర్లు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

సదురు రోగికి ఇప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యలుండగా.. కరోనా సోకడంతో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. మంచి దిగవద్దని చెప్పినా వినకుండా బెడ్ దిగి బాత్రూంకు వెళ్లి అక్కడే కుప్పకూలి చనిపోయాడని వార్తలొస్తున్నాయి. డాక్టర్లు బెడ్ దిగవద్దని సూచించినా అతడు వినిపించుకోకుండా ఇలా చేశాడట..

అతడి బంధువులు ఇది వైద్యుల నిర్లక్ష్యమేనంటూ వైద్యుడిపై ప్లాస్టిక్ కుర్చీ విసిరాడట.. అనంతరం ఐరెన్ కుర్చీ చేతిపై కొట్టాడట.. దీంతో వైద్యుడికి గాయాలయ్యాయి.

దీంతో గాంధీ వైద్యులందరూ విధుల్ని బహిష్కరించి ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.