Begin typing your search above and press return to search.
చెస్ట్ ఆస్పత్రిలో మరో వ్యక్తి మృతి
By: Tupaki Desk | 30 Jun 2020 4:00 AM GMTఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో మరో దారుణం జరిగింది. ఈ ఉదయం సయ్యద్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఐసీయూలో ఒక్కరినే ఉన్నానని.. ఎవరూ పట్టించుకోవడం లేదని వైద్యుల నిర్లక్ష్యం వల్ల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాని వ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఉదయం తనువు చాలించాడు. అతడి చివరి సెల్ఫీ వీడియో వైరల్ అయ్యింది.
హైదరాబాద్ కు చెందిన సయ్యద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రికి వచ్చాడు.. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చేర్చారు. ఆ ఐసీయూలో ఒక్కడే ఉండడంతోపాటు వైద్యులు ఎవరూ పట్టించుకోవడం లేదని .. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఈ ఉదయం చనిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
నిన్ననే హైదరాబాద్ లోని జవహర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రికి వచ్చాడు. తనకు ఊపిరి ఆడడం లేదని చెప్పినా వెంటిలేటర్ ను తొలగించారని.. చనిపోయే ముందు తండ్రికి రోగి సెల్ఫీ వీడియో పంపాడు. 3 గంటలుగా బతిమిలాడినా సిబ్బంది వెంటిలేటర్ పెట్టడం లేదని గుండె ఆగిపోతోందని.. ఊపిరి ఒక్కటే కొట్టుకుంటుందంటూ వ్యక్తి తల్లడిల్లాడు. వద్దన్న వినకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని.. తాను చచ్చిపోతున్నా అంటూ సదురు రోగి వీడియోలో వేడుకున్న వైనం ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ తర్వాత అతడు చనిపోయాడు. ఈరోజు సయ్యద్ అనే వ్యక్తి కూడా అచ్చం అదే ఎర్రగడ్డ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
తెలంగాణలో వైద్యుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా రెండో ఘటన.. సెల్ఫీ వీడియో చూసిన నెటిజన్లు వైద్యులను తిట్టిపోస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.