Begin typing your search above and press return to search.

ఆసుపత్రిలో పేషెంట్ ను మరో పేషెంట్ ను హత్య చేశాడు

By:  Tupaki Desk   |   12 April 2021 7:30 AM GMT
ఆసుపత్రిలో పేషెంట్ ను మరో పేషెంట్ ను హత్య చేశాడు
X
అనూహ్య పరిణామానికి వేదికగా మారింది ఉత్తరప్రదేశ్ లోని ఒక ఆసుపత్రి. ఇద్దరు రోగుల మధ్య మొదలైన గొడవ..కొట్టుకునే వరకువెళ్లటమే కాదు.. చంపేసుకునేంత దారుణానికి దారి తీసింది. ఆసుపత్రిలో చేరటమంటేనే.. అనారోగ్యంగా ఉంటేనే. అలాంటిది దవాఖానాలో కూడా గొడవ పడి దారుణంగా చంపేసుకునే వైనం జీర్ణించుకోలేని దుస్థితి. ఇంతకీ.. గొడవ ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలైంది? చంపుకునే వరకు ఎందుకు వెళ్లిందన్న విషయాల్లోకి వెళితే..

యూపీలోని బరేలీ పరిధిలోని షాజహాన్ పూర్ లో ఒక మెడికల్ కాలేజీలో ఒక పేషెంట్ చేశారు. అతడి పేరు అద్బుల్ రెహమాన్. తన బెడ్ వద్దకు వచ్చిన అతనికి.. మరో పేషెంట్ అక్కడే ఉండటంతో కోపాన్ని ఆపుకోలేకపోయాడు. అది తన బెడ్ అని.. ఖాళీ చేయాలన్నాడు. నీ బెడ్ అని ఎక్కడైనా రాసి ఉందా? అని అక్కడున్న మరో రోగి హన్స్ రామ్ ఘాటుగా బదులిచ్చాడు. దీంతో.. మాటా.. మాటా పెరిగింది.

దీంతో ఒళ్లు మండిపోయిన అద్బుల్.. హన్స్ రామ్ మీద కలయబడ్డాడు. ఆవేశంతో అదే పనిగా పిడి గుద్దులు గుద్దాడు. ఈ గొడవను చూసి.. పరిగెత్తుకుంటూ ఆసుపత్రి సిబ్బంది వచ్చేసరికి.. హన్స్ రామ్ నిర్జీవంగా పడిపోయి ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. వారొచ్చి.. అబ్దుల్ ను అరెస్టు చేశారు. అయితే.. హత్య చేసిన నిందితుడి తండ్రి వచ్చి.. పోలీసులకు కొత్త విషయాన్ని వెల్లడించారు. అబ్దుల్ మానసిక అనారోగ్యంతో ఉన్నాడని.. ట్రీట్ మెంట్ కోసం ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. దీంతో.. అసలు తప్పు ఎక్కడ జరిగింది? గొడవ ఎందుకు షురూ అయ్యిందన్న అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు.

తీవ్రజ్వరంతో చేరిన 45 ఏళ్ల హన్స్ రామ్ కు.. డీ హైడ్రేషన్ సమస్యతో ఆసుపత్రిలో చేరిన పాతికేళ్ల అబ్దుల్లాకు ఒకే రూంలో వేర్వేరు బెడ్లు కేటాయించారు. ఉదయం టాయిలెట్ కు వెళ్లిన అబ్దుల్లా తన బెడ్ వద్దకు వచ్చాడు. అప్పటికే బెడ్ మీద పడుకున్న హన్స్ రామ్ పొరపాటున దాని మీద పడుకున్నాడు. తీవ్రమైన జ్వరం ఉండటంతో.. రామ్ కు కరోనా అని అబ్దుల్లా అనుమానించాడు. దీనికి తోడు.. తన బెడ్ మీద ఎందుకు పడుకున్నావని అడిగితే.. నోటికి వచ్చినట్లు మాట్లాడటంతోతీవ్ర ఆగ్రహానికి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును మరింత లోతుగా పోలీసులు విచారించనున్నారు. నాలుగు పిడిగుద్దులకే ఎందుకు చనిపోయాడన్నది చూస్తే.. హన్స్ రామ్ ను బెడ్ మీద పడేసి.. అతని రొమ్ము మీద కూర్చొని.. బలంగా పిడిగుద్దులు ఛాతీ మీద అబ్దుల్లా కొట్టటంతో చనిపోయినట్లు భావిస్తున్నారు.