Begin typing your search above and press return to search.
వైరస్ ను 6రోజుల్లోనే జయించిన HIV పేషెంట్ !
By: Tupaki Desk | 27 May 2020 10:10 AM GMTప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ మహమ్మారి భారిన పడి , కోలుకోవాలంటే కనీసం 14 రోజుల సమయం పడుతుంది. కానీ , తాజాగా ఓ వ్యక్తి కేవలం ఆరు రోజుల్లోనే వైరస్ పై విజయం సాధించాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..అతనొక హెచ్‌ఐవీ పేషెంట్. ఈ సంఘటన లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వైరస్ నుండి ఆరు రోజుల్లోనే కోలుకోవడంతో అక్కడి డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలు చూస్తే.. ఉత్తరప్రదేశ్ లోని గొండాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి గత వారం ఢిల్లీలో ఉన్న బంధువులను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. అయితే ఆ సమయంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతడు గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు గాయాలవడంతో అతడిని ట్రీట్మెంట్ కోసం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని ట్రామాసెంటర్ కి తరలించారు. అయితే ట్రీట్మెంట్ సమయంలో బాధితుడు తనకు హెచ్‌ఐవీ ఉందని డాక్టర్లకు తెలిపాడు.
అదే సమయంలో అతడికి డాక్టర్లు కరోనా టెస్ట్ కూడా చేయగా...పరీక్షల్లో అతడికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు ట్రీట్మెంట్ అందించడంతో కేవలం 6 రోజుల్లోనే అతడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ... ‘ఇలాంటి కేసు రావడం ఇదే ప్రథమం. ప్రొటోకాల్ ప్రకారమే అతడికి వైద్యం చేశాం. కేవలం ఆరు రోజుల్లో అతడికి కరోనా నయమైంది. చికిత్స అనంతరం రెండు సార్లు కరోనా నెగిటీవ్‌గా రావడంతో అతడిని డిశ్చార్జ్ చేశాం. ప్రస్తుతం రెండు వారాల పాటు అతడిని హోం క్వారంటైన్‌లో ఉండమని చెప్పాం అని తెలిపారు.