Begin typing your search above and press return to search.
పెద్ద నోట్లు వద్దన్న హాస్పిటల్ కు షాక్
By: Tupaki Desk | 11 Nov 2016 10:05 AM GMTపెద్ద నోట్ల రద్దుకు మోడీ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణాల్లో - ఆసుపత్రుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. నిజానికి ఆసుపత్రుల్లో పాత నోట్లను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా అది అమలు కావడం లేదు. దీంతో జనం అష్టకష్టాలు పడుతున్నారు. అయితే... రద్దయిన నోట్లను తీసుకోవాలని గవర్నమెంటు చెప్పినా వినకుండా తమకు చిన్న నోట్లే కావాలని పట్టుబట్టిన కలకత్తాలోని ఒక ఆసుపత్రికి రోగి బంధువులు సరైన గుణపాఠం చెప్పారు.
సుకంతొ చౌలె అనే వ్యక్తికి డెంగీ జ్వరం రావడంతో కలకత్తాలోని బీపీ పొద్దార్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయితే.. అంతలోనే ఈ నోట్ల రద్దు అంశం తెర మీదకు వచ్చింది. దీంతో బుధవారం డిశ్చార్జి కావాల్సిన చౌలె బంధువులు బిల్లు చెల్లించడానికి వెళ్లగా పెద్ద నోట్లు వద్దని ఆసుపత్రి వర్గాలు అభ్యంతరం చెప్పాయి. చెక్కు తీసుకోవడానికి కూడా నిరాకరించాయి.
రోగి బంధువులు ఎంత బతిమలాడినా వారు వినకపోవడంతో ఏం చేయాలో వారికి దిక్కు తోచలేదు. ఆసుపత్రి యాజమాన్యానికి బుద్ధి చెప్పాలని భావించారు. వాట్స్ యాప్ గ్రూపుల్లో ఆ విషయం అందరికీ జరిగిన విషయం చెప్పి వెంటనే కాయిన్సు కావాలని వారు అభ్యర్థించారు. జనం కూడా బాగా రెస్పాండయ్యారు. కొన్ని గంటల్లోనే 40 వేల చిల్లర వారికి చేరింది. వెంటనే దాన్ని క్యారీ బ్యాగుల్లో నింపి ఆసుపత్రికి తేగా మళ్లీ ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు. తమకు కాయిన్సు వద్దని.. నోట్లే కావాలని.. అవి కూడా రూ.100లు కావాలని కోరారు. దీంతో ఆగ్రహించిన బంధువులు పోలీసు కేసు పెట్టడానికి సిద్ధమవవడంతో ఆసుపత్రివారు ఈ చిల్లర తీసుకున్నారు. ఈ డబ్బు లెక్క పెట్టడానికి ఆసుపత్రికి చెందిన ఆరుగురు సిబ్బంది మూడు గంటలకు పైగా కష్టపడ్డారు. ఆసుపత్రి వేసిన చిల్లర వేషాలకు రోగి బంధువులు బాగానే బుద్ది చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/