Begin typing your search above and press return to search.
యూపీ రైలు ప్రమాదంలో 45 మంది బలి
By: Tupaki Desk | 20 Nov 2016 3:40 AM GMTఆదివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలో పక్హరయన్వద్ద పట్నా.. ఇండోర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు14కు పైగా బోగీలు పట్టాలు తప్పటంతో భారీప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తొలుత వార్తలువచ్చాయి.అయితే.. 14కు పైగా బోగీలు పట్టాలు తప్పిన నేపథ్యంలో మృతులసంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందన్న అంచనాకు తగ్గట్లే.. తాజాగా 45 మంది దుర్మరణం పాలైనట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తునగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే రైల్వే భద్రతాసిబ్బంది.. ఉన్నతాధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేప్టటారు.వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని వైద్య సేవల్ని అందిస్తున్నాయి. పట్టాలు తప్పిన బోగీలు పెద్దఎత్తున ఉండటంతో మృతుల సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇక.. రైలు ప్రమాదం చోటుచేసుకున్న మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకల్ని నిలిపివేసి.. సహాయక చర్యలుచేపట్టారు.
తెల్లవారుజామున 3.10 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘోరప్రమాదంలో.. ప్రమాదం జరిగిన విషయం అర్థమయ్యే లోపే పలువురు ప్రాణాలుకోల్పోయారు. తెల్లవారుజామున ప్రమాదం జరగటం.. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో నిద్రలోనే పెద్ద ఎత్తున ప్రాణాలుపోవటం అందరిని కలిచివేస్తోంది. పెద్ద ఎత్తున బోగీలు పట్టాలు తప్పటంతో..వాటిని తొలగించేందుకు భారీ క్రేన్లను తెప్పిస్తున్నారు. సహాయక చర్యల్నిముమ్మరం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/