Begin typing your search above and press return to search.
10 నిమిషాల వీడియోలో ఇప్పటివరకు ఏ నేత చేయని పని చేసిన పట్టాభి
By: Tupaki Desk | 21 Oct 2021 4:21 AM GMTఅనూహ్య పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది ఆంధ్రప్రదేశ్. అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య నడుస్తున్న రాజకీయ పోరు అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాజకీయాల్లో సహజమైన విమర్శలు.. ప్రతి విమర్శలకు భిన్నంగా తిట్లు బూతులతో పాటు.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే..టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఆగ్రహంతో దాడులకు పాల్పడటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పట్టాభి చేసినట్లుగా చెబుతున్న అనుచిత వ్యాఖ్యల ఆరోపణతో పాటు.. శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారంటూ ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. బుధవారం ఉదయం నుంచి పట్టాబిని అరెస్టు చేస్తారన్న ప్రచారం సాగగా.. రాత్రి తొమ్మిది గంటల వేళలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉంటే.. తనను పోలీసులు అదుపులోకి తీసుకోవటానికి కొద్ది గంటల ముందు.. పట్టాభి అనూహ్యమైన పని చేసి అందరిని విస్మయానికి గురి చేశారు.
తనను పోలీసులు అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తారన్న సందేహాల్ని పట్టాబి వ్యక్తం చేశారు. ఇందుకు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజును అరెస్టు చేసిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. తాను ఇప్పుడు పూర్తి ఆరోగ్యం ఉన్నానంటూ.. ఒక వీడియోను రికార్డు చేశారు. అందులో తన చేతులు.. కాళ్లు..అరికాళ్లు పొట్ట.. వీపుతో పాటు.. కాళ్ల తొడలతో సహా తనకు ఎలాంటి గాయాలు లేవని.. తన కాళ్లకు ఎడిమా లేదంటూ పాదాల్నిచూపించారు.
అంతేకాదు.. తన వంటి మీద చిన్న గీత పడినా అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. తనకు దేశ రాజ్యాంగ.. న్యాయవ్యవస్థల మీద నమ్మకం ఉందన్నారు. తనకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదన్నారు. అందుకే తన ఫుల్ బాడీని చూపిస్తూ.. ఎక్కడా ఎలాంటి మచ్చ కానీ గీత కానీ లేదని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని పేర్కొన్నారు. ఎంపీ రఘురామ ఉదంతాన్ని గుర్తుచేస్తూ.. అదే రీతిలో తనపై దాడికి పాల్పడాలన్న ఆలోచన చేస్తున్నారన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా తన బాడీ మొత్తాన్ని వీడియో తీసినట్లుగా చెప్పారు. ఏమైనా.. ఇప్పటివరకు మరే నేత చేయని రీతిలో తన ఒంటిని చూపిస్తూ పది నిమిషాలకు పైనే నిడివి ఉన్న వీడియోను పట్టాభి సోషలో మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడీ ఉదంతం సంచలనంగా మారింది.