Begin typing your search above and press return to search.
పట్టిసీమపై సీమలో సీన్ మారిపోతోంది బాబు
By: Tupaki Desk | 30 Sep 2017 1:19 PM GMT``పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కావడంతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు మళ్లించి తద్వారా శ్రీశైలంలో పొదుపయ్యే కృష్ణాజలాలను రాయలసీమకు అందిస్తాం. గోదావరి-కృష్ణానదుల అనుసంధానం కోసం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది`` రాష్ట్రంలో ఎక్కడ సభ నిర్వహించినా గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలు ఇవి. అయితే బాబు ప్రచారపటాటోపంపై రాయలసీమలో మండిపడుతున్నారు. వాస్తవానికి పట్టిసీమ కారణంగా రాయలసీమకు చేకూరాల్సిన ప్రయోజనం అడకత్తెరలో చిక్కుకుందని సాగునీటి రంగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యంగానైనా శ్రీశైలానికి చేరుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే వచ్చి నీటిని వచ్చినట్లు దిగువ సాగర్‌కు విడుదల చేయడంపట్ల రైతులకు ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదంటున్నారు. శ్రీశైలం చేరిన కృష్ణాజలాలను రాయలసీమకు అందించాలంటే జలాశయంలో కనీస నీటిమట్టం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రక్రియకు అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్న అభ్యంతరాలు, విద్యుత్ ఉత్పత్తి కారణంగా రాయలసీమకు కృష్ణాజలాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతాయా అన్న అనుమానం తలెత్తుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక ఆలస్యం కావడంతో రాయలసీమ రైతాంగానికి సకాలంలో సాగునీరు అందించలేకపోయారు. ఆలస్యంగానైనా శ్రీశైలం చేరిన నీటిని సీమ కర్షకులకు అందించడానికి ఎదురవుతున్న అవాంతరాలతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 854 అడుగుల పరిధిని దాటి నీరు ఉన్నా ఇప్పటి వరకూ హంద్రీ-నీవా కాలువ కింద ఉన్న కర్నూలు జిల్లాలోని చెరువులు, అనంతపురం జిల్లాలోని చెరువులకు నీరందించలేకపోయారు.
పోతిరెడ్డిపాడు నుంచి 10వేల క్యూసెక్కుల ప్రవాహంతో నీటిని తరలిస్తున్నా ఇంతవరకూ శ్రీశైలం కుడికాలువ (ఎస్‌ఆర్‌బిసి)కి నీటిని మళ్లించలేదు. ఈ కాలువ ద్వారా నంద్యాల సమీపంలోని గోరుకల్లు, బనగానపల్లె సమీపంలోని అవుకు జలాశయాలను నింపుతూ కడప జిల్లాకు నీటిని తరలించాల్సి ఉంది. శ్రీశైలం జలాశయానికి నీరు చేరుకున్న తరువాత గత రెండు వారాలుగా నీటిని పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవాకు విడుదల చేసినా 25 శాతం భూములకు కూడా సాగునీరు అందలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ వదిలిన నీటితో రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చడానికి మాత్రమే ఉపయోగించామని వారంటున్నారు. సాగునీరు వస్తుందని ఆశతో ఉన్న రాయలసీమ రైతులకు తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాలు, విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేయడం, ఎగువ నుంచి జలాశయానికి నీటి చేరిక తగ్గుముఖం పట్టడంతో రాయలసీమ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టిసీమ జలాలు రాయలసీమ రైతుల్లో ఆనందం నింపుతాయన్న సీఎం చంద్రబాబు మాటలతో ఇంతవరకూ ఆశగా ఎదురుచూసిన సీమ రైతులు ప్రస్తుత పరిణామాలు చూస్తూ పట్టిసీమ ప్రయోజనం అందని ద్రాక్షేనంటూ పెదవి విరుస్తుండటం గమనార్హం.బాబు ప్రచారానికి వాస్తవ పరిస్థితికి మధ్య తేడా ఉందని ఇకనుంచైనా వాస్తవ స్థితిగతులకు అనుగుణంగా ఉండాలని అంటున్నారు.