Begin typing your search above and press return to search.
పవన్ నినాదంతో పాల్ యాత్ర!
By: Tupaki Desk | 30 July 2022 2:30 PM GMTప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మళ్లీ ఈ మధ్య కాలంలో రాజకీయంగా హడావుడి చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన పాల్ పార్టీకి ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదు. ఆమాట కొస్తే ఏపీలో రెండు చోట్ల పోటీ చేసిన కేఏ పాల్‌కు కూడా డిపాజిట్లు రాలేదు. గత ఎన్నికల్లో క్రైస్తవ ఓట్లు, ఎస్సీ ఓట్లు పూర్తిగా వైఎస్సార్సీపీకి పోకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడే కేఏ పాల్‌తో పార్టీ పెట్టించారని వార్తలు వచ్చాయి.
2019 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడిపోయిన కేఏ పాల్ ఆ తర్వాత అడ్రస్ లేకుండా మాయమైపోయారు. మళ్లీ ఇటీవల కాలంలో హడావుడి చేస్తున్నారు. దేశంలో మొత్తం 175 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రజా శాంతి పార్టీ పోటీ చేస్తుందని చెబుతున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన కేఏ పాల్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఒక్క సీటూ రాదని, ఆ పార్టీ నుంచి పోటీ చేసేవారికి కనీసం డిపాజిట్లు కూడా రావని తేల్చిచెప్పారు.
అలాగే పాల్ రావాలి.. పాలన మారాలి పేరుతో యాత్ర చేపడుతున్నానని తెలిపారు. వాస్తవానికి పవన్ రావాలి.. పాలన మారాలి అని జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఈ నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు అదే నినాదాన్ని కేఏ పాల్ కాపీ చేసి పాల్ రావాలి.. పాలన మారాలి అంటూ మార్చడం విశేషం.
కాగా రాష్ట్రంలో కాపులు, దళితుల ఓట్లతో అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారని, కానీ ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లను ఎవరూ కొనలేరన్న విషయాన్ని సీఎం వైఎస్ జగన్ తెలుసుకోవాలని కేఏ పాల్ అంటున్నారు.
రాష్ట్రంలోని రాజకీయ నేతలు తనతో కలిసి నడిస్తే కోట్లాది రూపాయలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని పాల్ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా కాకినాడలో తన వాహనాలను తీసుకెళ్లిన వారిని దేవుడే శిక్షిస్తాడని పాల్ శాపనార్థాలు పెట్టారు.