Begin typing your search above and press return to search.
పవన్ గోసంరక్షణ, ద్రవాహారంపై సెటైర్లే సెటైర్లు
By: Tupaki Desk | 30 Oct 2019 6:05 AM GMTరాజకీయ నాయకుడిగా విజయం సాధించాలని తపిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాసమస్యలపై పోరాటాటు చేయడమే కాదు అప్పుడప్పుడు సామాజిక బాధ్యతా తనకుందని చాటుకునేందుకు ట్రై చేస్తుంటారు. ఆ సమయంలో ఆయనలోని నటుడు బయటకొచ్చేస్తుంటాడు. అలాంటి వేళ పవన్ కల్యాన్ పీఆర్ టీములు మీడియాకు విడుదల చేసే ఫొటోలు.. పవన్, జనసేన సోషల్ మీడియా పేజీల్లో పెట్టే చిత్రాలూ అభిమానులకే కాదు ఆయన్ను విమర్శించేవారికీ కన్నులపండుగ తీసుకొస్తాయి. కానీ, కారణాలు వేర్వేరు. తాజాగా ఆయన కార్తీక మాసం సందర్భంగా వ్రతం చేపట్టానని ప్రకటించడం.. వ్రతం సందర్భంగా ఆయన కార్యాచరణ ప్రకటించడం అన్నీ నిన్నంతా సోషల్ మీడియాలో సెటైర్లకు ఊతమిచ్చింది.
ఏడాదికి ఏడు నెలలు పవన్ ఇలాంటి దీక్షల్లోనే ఉంటారని.. కార్తీక మాస దీక్ష సందర్భంగా పవన్ కేవలం ద్రవాహారమే తీసుకుంటారని ప్రకటించడంపై ఆయన్ను విమర్శించే వైసీపీ సోషల్ మీడియా సైన్యాలు సెటైర్లు వేశారు. పవన్ నిత్యం ద్రవంలోనే మునిగితేలుతుంటారంటూ వెటకారమాడారు.
తన ఫాంహౌస్‌లో మొక్కలు నాటడం.. ఆవులకు అరటి పండ్లు తినిపించడం వంటివన్నీ షో కోసం చేసినవేనంటూ విమర్శలొచ్చాయి. బీజేపీ ప్రాబల్యం పెరుగుతుండడంతో దాన్ని తట్టుకోవడం కోసమంటూ గోవులకు అరటిపండ్లు తినిపిస్తూ ఫొటోలు దిగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చేసిన షోలకు సంబంధించిన ఫొటోలతో మీమ్స్ కూడా పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన పంచెకట్టుకుని తిరిగిన ఫొటోలు.. చెట్టు కింద చిన్న మట్టి పాత్రలో గంజన్నం తినడం... కారు వెనుక డిక్కీలో పడుకుని టీ తాగడం వంటి ఎన్ని చిత్రవిచిత్రాలను జనం మీమ్స్ కోసం వాడుకుని పవన్‌పై సెటైర్లు పేల్చారు.