Begin typing your search above and press return to search.
హవ్వా.. ఏంటీ దారుణం? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పవన్ సపోర్టా?
By: Tupaki Desk | 9 March 2021 1:30 PM GMTఏపీలో పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అని నినదిస్తున్న పరిస్థితి నెలకొంది. కనీస ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరైనా సరే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలని నినదిస్తున్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏపీలోని బీజేపీ నేతలు కూడా తప్పు పడుతున్నారు. తాము కేంద్రంతో మాట్లాడి సెట్ చేస్తామంటున్నారు.
ఇంత వ్యతిరేకత పెల్లుబుకుతున్నా.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రైవేటీకరణ తప్పదని స్పష్టం చేసినా కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతారని ఎవ్వరూ ఊహించి ఉండరు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి పవన్ కళ్యాణ్ సపోర్టు చేసి ఏపీ ప్రజల దృష్టిలో ఇప్పుడు విలన్ అయిపోయారనే చెప్పాలి.
తాజాగా పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్ ' కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను' సమర్థించడం సంచలనమైంది. ఈ విషయంలో కేంద్రాన్ని పవన్ వెనకేసుకురావడం విశేషం. ఈ ఒక్క విశాఖ ప్లాంట్ మాత్రమే కాదని.. దేశవ్యాప్తంగా ఈ ప్రైవేటీకరణ జరుగుతోందని పవన్ స్పష్టం చేశారు. ఇది కేంద్రంలోని బీజేపీ తీసుకున్న నిర్ణయమని.. నష్టాల్లో ఉన్న కంపెనీలను వదిలేస్తుందని.. వ్యాపారం చేయడం ప్రభుత్వం విధి కాదని కేంద్రం నిర్ణయాలకు మద్దతుగా పవన్ మాట్లాడారు. ప్రభుత్వం వ్యాపారాలు చేయదని.. పెట్టుబడులు పెట్టదని వారు తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుందని సమర్థించారు.
పవన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు విశాఖ ఉద్యమకారుల పుండుపై కారం చల్లినట్టైంది. కనీసం మద్దతు ఇవ్వకుండా ప్రైవేటీకరణకు మద్దతుగా పవన్ మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. కనీసం ఏపీ బీజేపీ నాయకులు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంత సపోర్టు బీజేపీ హైకమాండ్ చేయడం లేదని.. కానీ పవన్ మాత్రం గంపగుత్తగా కేంద్రాన్ని వెనకేసురావడం చర్చనీయాంశమైంది. పవన్ తీరుపై ఏపీ ప్రజల్లోనూ వ్యతిరేక భావన ఏర్పడుతోంది. ఈ పరిణామం ఖచ్చితంగా జనసేనకు, పవన్ కు నష్టం కలిగిస్తుందన్న వాదన నెలకొంది.