Begin typing your search above and press return to search.
ఒడిసాలో రష్యా నేత ఆత్మహత్య.. పుతిన్ విమర్శించడమే నేరమా?
By: Tupaki Desk | 28 Dec 2022 3:30 AM GMTరష్యాకు చెందిన కీలకనాయకుడు, తరచుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను తరచుగా విమర్శించే ప్రముఖ వ్యాపారవేత్త పావెల్ ఆంటోవ్ ఒడిసాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. రాయగడ జిల్లాలో ఉన్న త్రీస్టార్ హోటల్ లోని మూడో అంతస్థు కిటికీ నుంచి దూకి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇది ప్రమాదమా, లేక ఆత్మహత్యా అనే విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే.. పావెల్ ఆత్మహత్యకు పాల్పడ్డారని కొందరు చెబుతున్నారు.
మూడో అంతస్థు నుంచి పావెల్ కింద పడిపోయిన వెంటనే ఆయన టూరిస్ట్ గైడ్ వెంటనే ఆసుపత్రికి తరలిం చారు. అయితే కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పావెల్. రష్యాలోని వ్లాదిమిర్ ప్రాంతం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తరచుగా ఆయన పుతిన్‌పై విరుచుకుపడుతుంటారు. ఈ నెల 22న ఇదే హోటల్లో బి.వ్లాదిమిర్ అనే వ్యక్తి కూడా మృతి చెందారని, ఆయన గుండెపోటుతో కన్నుమూశారని అధికారులు తెలిపారు.
"ఈ నెల 21న రాయగడలోని హోటల్‌కు నలుగురు వ్యక్తులు వచ్చారు. 22వ తేదీ ఉదయం వారిలో ఒకరు (బి. వ్లాదిమీర్) మృ తి చెందారు. ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో ఆయన స్నేహితుడు పావెల్ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యారు. ఈయన కూడా ఈ నెల 25న మృతి చెందారు" అని రాయగడ ఎస్పీ వివేకానంద శర్మ తెలిపారు.
వీరికి గైడ్‌గా వ్యవహరించిన జితేంద్ర సింగ్ ఏమన్నారంటే.. "నలుగురు రష్యా జాతీయులు వారి ట్రావెల్ ఏజెంట్తో కలిసి ఢిల్లీ నుంచి ఈ నెల 21న సాయంత్రం 4.30 గంటల సమయంలో హోటల్కు వచ్చారు. ఆ సమయంలో వారు మద్యం తాగి ఉన్నారు. వారి దగ్గర లిక్కర్ బాటిళ్లు కనిపించాయి. హోటల్లోని బార్ నుంచి మరికొన్ని లిక్కర్ బాటిళ్లను కొనుగోలు చేశారు" అని వివరించారు. ఇదిలావుంటే, గత జూన్లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై పావెల్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కీవైపై రష్యా వైమానిక దాడులను ఆయన ఉగ్రవాద దాడులతో పోల్చారు. అంతేకాదు.. పుతిన్‌ను కూడా.. ఆయన ఉగ్రవాదిగా అభివర్నించారు. దీంతో స్వదేశంలోనే ఆయనకు హెచ్చరికలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ చనిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.