Begin typing your search above and press return to search.
తొలిసారి తన 'పవర్' చూపించిన పవన్ కల్యాణ్.. వావ్ అనిపించే వ్యాఖ్యలు
By: Tupaki Desk | 26 May 2022 5:30 AM GMTసున్నితమైన అంశాల్ని.. అత్యంత సున్నితమైన సందర్భాల్ని డీల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఏ చిన్న పొరపాటు దొర్లినా కూడా మొదటికే మోసం వస్తుంది. అలాంటి వేళలో బయటకు రావటం.. మీడియాముందుకు వచ్చి మాట్లాడటానికి చాలానే ధైర్యం.. తాను చెప్పే అంశాల్ని తానెంతగా విశ్వసిస్తున్నాన్న నమ్మకంతో పాటు.. నిజాయితీ చాలా అవసరం.
వీటిల్లో ఏది ఏ మాత్రం మిస్ అయినా.. జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుంది. ఈ కారణంతోనే సున్నిత సందర్భాల్లో నేతలు.. అధినేతలు సీన్లోకి రాకుండా ప్రకటనలు ఇచ్చి ఊరుకుంటారు.బయటకువచ్చి మాట్లాడే ధైర్యం చేయరు.
అయితే.. అలాంటివాటికి తాను అతీతమన్న విషయాన్ని చెప్పేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వజ్రాన్ని సాన పెట్టిన కొద్దీ.. దాని గొప్పతనం తెలుస్తుందన్నట్లుగా.. జనసేనానిలో ఉన్న గొప్పతనం ఏమిటి? అతడు మాట్లాడే మాటల విషయంలో అతడి స్టాండ్ ఎంత క్లియర్ గా ఉంటుందన్న విషయాన్ని తాజా ఎపిసోడ్ లో స్పష్టం చేశారని చెప్పాలి.
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును ముందు పెట్టాలన్న డిమాండ్.. దానిపై అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున తమ ఆగ్రహాన్ని ప్రదర్శించటం.. అందుకు కొందరు నేతలు తోడు కావటం తెలిసిందే. దీంతో అమలాపురం పట్టణంలో అసాధారణ పరిస్థితులు చోటు చేసుకున్న వేళ.. దానిపై మాట్లాడటానికి ముందుకు రావటానికి మించిన పెద్ద టాస్కు మరొకటి ఉండదు.
అలాంటి కష్టమైన.. క్లిష్టమైన అంశాల్ని టేకప్ చేసిన పవన్ కల్యాణ్.. తన వాదనను స్పష్టంగా చెప్పటమే కాదు.. అధికార పక్షం చేసిన తప్పుల్ని పాయింట్ల వారీగా ఎండగట్టిన వైనంతో ఆయనకు ఇప్పుడు సరికొత్త ఇమేజ్ వచ్చిందని చెబుతున్నారు. అమలాపురంలో అసాధారణ పరిస్థితులు ఎదురైన తర్వాత..బయటకు వచ్చి మాట్లాడిన పార్టీ అధినేతల్లో పవన్ ముందుంటారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును పెట్టే విషయంపై అధికార పార్టీ వ్యవహరించిన తీరును ఎండగట్టే విషయంలో పవన్ వ్యవహరించిన తీరుపై వైసీపీకి చెందిన నేతలు సైతం వావ్ అనే మాట వారి నోటి నుంచి వస్తోంది.
అత్యంత సున్నిత అంశాన్ని పవన్ డీల్ చేసిన తీరు చూస్తే.. ఆయనలోని రియల్ పవర్ స్టార్ ఏమిటన్నది బయటకు వచ్చిందని చెబుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగడుతూనే.. ఏం చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సూటిగా చెప్పేసిన పవన్ ధైర్యం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అంతేకాదు.. ఇంతకాలం పవన్ ను ఉద్దేశించి పార్ట్ టైం పొలిటీషియన్.. ప్యాకేజీ స్టార్ లాంటి మాటల ప్రభావానికి లోనై.. పెద్దగా లెక్కలోకి తీసుకోని వారు సైతం తాజా ఎపిసోడ్ తర్వాత.. తాము పవన్ కల్యాణ్ ను తప్పుగా అర్థం చేసుకున్నామని.. తప్పుగా భావించామని చెప్పటం విశేషం. పవన్ విషయంలో తాము వేసుకున్న లెక్కలన్ని తప్పుగా నిలిచాయంటున్నారు. ఏమైనా అమలాపురం ఎపిసోడ్ లో పవన్ ఇమేజ్ భారీగా పెరిగిపోయిందని చెప్పక తప్పదు.