Begin typing your search above and press return to search.
దారులు వేరైనా.. పవన్, లోకేష్ ఇద్దరి గమ్యం ఒక్కటే..
By: Tupaki Desk | 30 Dec 2022 4:45 AM GMTఆంధ్రప్రదేశ్ లో మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే అలర్ట్ అయ్యాయి. అధికార వైసీపీ సంక్షేమ పథకాలతో ప్రజలను తమ వైపుకు తిప్పుకుంటోంది. మరోసారి ప్రజా పాలన చేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ ఇటీవల స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏర్పడినట్లయింది. మరోవైపు ప్రతిపక్షాలు తమ దూకుడును పెంచాయి. ప్రధాన ప్రతిక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోడ్ షోల పేరుతో ఆయా ప్రాంతాలు పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేశ్ బాబు పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. మరో ప్రతిపక్ష పార్టీ జనసేన సైతం జనాల్లోకి చొచ్చుకుపోతుంది. త్వరలో బస్సు యాత్ర పేరుతో ఆ పార్టీ అధినేత పవన్ రాష్ట్రం మొత్తం తిరగనున్నారు. అయితే లోకేశ్ పాదయాత్ర, పవన్ బస్సు యాత్ర లక్ష్యాలు ఒకటేనని తెలుస్తోంది. అదేంటంటే..?
విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014లో టీడీపీ మొదటిసారి పాలన చేపట్టింది. అయితే వైసీపీ నేత గ్రామగ్రామాన తిరుగుతూ తనకు ఒక్కచాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలను కోరారు. పలు హామీలు ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీలోని లోపాలను ప్రజలకు వివరించారు. మొత్తానికి 2019లో గద్దెనెక్కారు. ఇప్పుడు టీడీపీ అదే చేస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు చివరి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 2019 నుంచి ఏపీ అభివృద్ధిలో కుంటుపడిందని, తనకు అవకాశం ఇస్తే చక్కబెడుతానని అంటున్నారు. ఆయనకు తోడుగా లోకేశ్ బాబు పాదయాత్ర చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. జగన్ లాగే తాను కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వైసీపీ చేసిన తప్పులను వివరించనున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పూర్వ వైభవం వస్తుందని చెప్పనున్నారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన ఒకే ఒక్క సీటును దక్కించుకుంది. అయితే ఈసారి మాత్రం అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఆ పరిస్థితి రాకపోయినా కీలకంగా మారేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజా కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకుపోయిన పవన్ వారికి అండగా ఉంటామంటున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తూ వారికి అక్కున చేర్చుకుంటున్నారు. అటు రాజకీయంగా ఇతర పార్టీలతో కలిసి వెళ్తూ పార్టీ పటిష్టతను పెంచుతున్నారు. ఇందులో భాగంగా బస్సు యాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే 'వారాహి' పేరు పెట్టిన విభిన్నమైన బస్సును ప్రజలకు పరిచయం చేశారు.
అయితే లోకేశ్ పాదయాత్ర, పవన్ బస్సు యాత్ర లక్ష్యాలు ఒక్కటనేనని తెలుస్తోంది. లోకేశ్ పాదయాత్రలో తనను సీఎం చేయాలని కోరకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయనున్నారు. ఐదేళ్ల కాలంలో వైసీపీ నాయకులు చేసిందేమిటో వివరించనున్నారు. మొత్తంగా వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందకు యత్నించనున్నారు. చంద్రబాబు రోడ్ షోలతో ఆకట్టుకునేందు ట్రై చేస్తుండగా.. లోకేశ్ పాదయాత్రతో గ్రామ గ్రామాన వెళ్లి వారి సమస్యలు విననున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాకున్న జగన్ ను గద్దె దించేందుకు కృషి చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.
అటు జనసేన లక్ష్యం ఒక్కటే. ఇప్పటికే వైసీపీ పై గురిపెట్టిన పవన్ జగన్ ను ఓడించేందుకు పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జనసేన మొత్తంగా అధికారంలోకి వస్తుందనే విషయం అటుంచితే అత్యధిక సీట్లు సాధించి కీలకంగా మారేందుకు పవన్ ప్రణాళిక వేసుకున్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. టీడీపీతో కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ను టార్గెట్ చేశారు.
ఇలా ఇద్దరు నాయకులు తమ కార్యక్రమాల ద్వారా ప్రజలను తమవైపుకు తిప్పుకోనున్నారు. అయితే వీరి కార్యక్రమాలపై వైసీపీ ఎలాంటి వ్యూహం పన్నుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.