Begin typing your search above and press return to search.

ఏపీ, తెలంగాణ‌లో దేవాల‌యాలు చుట్టేస్తున్న ప‌వ‌న్‌.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   10 Feb 2022 8:34 AM GMT
ఏపీ, తెలంగాణ‌లో దేవాల‌యాలు చుట్టేస్తున్న ప‌వ‌న్‌.. రీజ‌నేంటి?
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బీజేపీ అజెండాను అమ‌లు చేస్తున్నారా? దేవాల‌యాల చుట్టూ ఆయ‌న తిరుగుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీలకులు. ప్ర‌స్తుతం జ‌న‌సేనాని ఒక దేవాల‌యం నుంచి మ‌రో దేవాల‌యానికి లాంగ్ టూర్ పెట్టుకున్న‌ట్టు తెలిసింది. మొత్తం 32 దేవాల‌యాల‌ను చుట్టిరావాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. అన్నీ కూడా న‌ర‌సింహ‌స్వామి ఆల‌యాలేన‌ని అవి కూడా తెలుగు రాస్ట్రాల్లో ఉన్న‌వేన‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌వ‌న్ ప్ర‌ణాళిక ప్ర‌కారం.. తెలంగాణ‌లోని రెండు దేవాల‌యాలు స‌హా ఏపీలోని 30 దేవాల‌యాల్లో ప‌వ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. అయితే.. ఈ టూర్ ఒకే ద‌ఫా సాగిపోద‌ని తెలుస్తోంది. మ‌ధ్య‌లో సినిమా షూటింగులు.. రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు వంటివి చేయ‌నున్నారు. మొత్తంగా 2024 ఎన్నిక‌ల‌ నాటికి.. ప‌వ‌న్ ఈ దేవాల‌యాల ప‌ర్య‌ట‌న‌ను పూర్తి చేయ‌నున్నారు..

ఈ ఆలయ పర్యటన తాను ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాదు, కానీ ఆయన ప్రతి షెడ్యూల్‌లో ఒక దేవాలయం నుండి మరో దేవాలయానికి పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు.

జగన్ మోహన్ రెడ్డికి క్రిస్టియన్ అనుబంధం గురించి మాట్లాడాలని, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా హిందూ ఓట్లను ఏకం చేయాలని ఆయన యోచిస్తున్నారు. ఆయన గత రాజకీయ కార్యకలాపాలను బట్టి అర్థమైనట్లుగా, ఇది ఆయన సొంత ఎజెండాతో కాదు. అది కూడా ఆయన మిత్రపక్షమైన బీజేపీ అజెండా కాదు. ఇదంతా కూడా టీడీపీ వ్యూహ‌ర‌చ‌నేన‌ని తెలుస్తోంది.

జగన్ మోహన్ రెడ్డికి క్రిస్టియన్ అనుబంధం గురించి బిజెపి కంటే టిడిపికి ఎక్కువ‌గా తెలుసు. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే తన మద్దతుదారుల నుండి చంద్రబాబు నాయుడు ఏదో ఒక కార్యాచరణను కోరుకుంటున్నారు. ఆయ‌న‌ తన రాజకీయ మైలేజీ కోసం అలాంటి కార్యకలాపాలను సృష్టించడానికి , ప్రోత్సహించడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టర‌నే విష‌యం రాజ‌కీయాల్లో అంద‌రికీ తెలిసిందే.

ఇటీవ‌ల అమ‌రావ‌తి రైతులు చేసిన న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పాద‌యాత్ర వెనుక‌.. టీడీపీ ఉంద‌ని.. అస‌లు ఈ ఆలోచ‌న చేసిందే చంద్ర‌బాబుఅని .. అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అంతేకాదు.. ఈ కార్య‌క్ర‌మానికి నిధులు స‌మ‌కూర్చింది. ఆహారం, వ‌స‌తి ఏర్పాట్లు చేసిదికూడా చంద్ర‌బాబేన‌ని అంటారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మానికి చివ‌రిలో తిరుప‌తిలో నిర్వ‌హించిన స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగించిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. దేవాల‌యం నుంచి దేవాల‌యం వ‌ర‌కు.. నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలు కూడా ఇలానే .. అమ‌రావ‌తి పాద‌యాత్ర మాదిరిగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. సో.. వీటి వెనుక కూడా చంద్ర‌బాబుఉన్నార‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. నిజానికి చంద్ర‌బాబు నుంచి ఎలాంటి పిలుపు అందుకుని ఉండ‌క‌పోతే.. ప‌వ‌న్‌కు నిజంగా..ఇంత స‌మ‌యం కేటాయించే అవ‌కాశం లేదు. అంతేకాదు.. క‌నీసం ఆయ‌న‌5 కిలోమీట‌ర్ల దూరం కూడా ప్ర‌యాణించే స‌మ‌యం లేదు. గ‌తంలో బెంజ్ స‌ర్కిల్ న‌నుంచి రామ‌వ‌ర‌ప్పాడు వ‌ర‌కు నిర్వ‌హించిన వామ‌ప‌క్షాల పాద‌యాత్ర‌లో న‌డిచేందుకు.. ప్ర‌యాస ప‌డిన విష‌యం తెలిసిందే.