Begin typing your search above and press return to search.

బాబాయ్ హత్య గురించి పవన్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   22 Aug 2022 7:30 AM GMT
బాబాయ్ హత్య గురించి పవన్ వ్యాఖ్యలు
X
కౌలు రైతుల‌కు సాయం చేసేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం సొంత జిల్లాకు వెళ్లారు. రాజకీయ విమ‌ర్శ‌లు తిప్పికొడుతూ త‌న ప్ర‌సంగం సాగించారు. ఆసక్తికరంగా ముఖ్య‌మంత్రి బాబాయ్ ను చంపిన హంత‌కులెవ్వ‌రో పోలీసులు ఇప్ప‌టిదాకా ప‌ట్టుకోలేద‌ని, ఎందుక‌ని ఇంత‌టి తాత్సారం జ‌రుగుతుందో చెప్పాల‌ని పవన్ డిమాండ్ చేశారు.

పవన్ ఈ అంశం టచ్ చేస్తాడని వైసీపీ ఊహించలేదు. ప‌వ‌న్ రాకతో సీమ దారంతా అభిమానుల వెల్లువ క‌నిపించింది. రానున్న కాలంలోనూ ఇదే విధంగా త‌న‌కు వీలున్నంత మేర బాధిత వ‌ర్గాల‌కు సాయం అందిస్తాన‌ని చెప్పి, కౌలు రైతు భ‌రోసా యాత్ర సాగించి, అధికార పార్టీపై విమ‌ర్శ‌లు కొన్ని చేశారు. వీటిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం.

ఇప్ప‌టికే వైసీపీ కాపు సామాజిక వ‌ర్గం నేత‌లు ప‌వ‌న్ ను ఉద్దేశించి అన‌రాని మాట‌లు అంటూ ఉన్నారు. రాయ‌ల సీమ నుంచే మార్పు రావాలి అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.

త‌న దృష్టిలో అన్ని కులాల‌కూ, అన్ని మ‌తాల‌కూ స‌మానత్వం అన్న‌ది ఉండాలి అని స్ప‌ష్టం చేస్తూనే, కాపు కులం అమ్ముకునేందుకు రాజ‌కీయాల్లోకి రాలేద‌ని, అటువంటి ఆరోప‌ణ‌లు అన్నీ మమ్మల్ని రాజకీయంగా అడ్డుకోవడానికి చేస్తున్నవే అన్నారు. అవ‌న్నీ అవాస్త‌వ‌మేన‌ని తేల్చేశారు.

ఆ మాటకొస్తే జ‌గ‌న్ ను న‌మ్ముకుని రెడ్డి సామాజిక వ‌ర్గం కూడా ఆనందంగా లేద‌ని తేల్చేశారు. జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించడం అంటే త‌న‌కు సిగ్గుగా ఉంద‌ని అన్నారు. తాను వీలున్నంత వ‌ర‌కూ సాయం చేస్తాన‌ని కులాల పేరిట రాజకీయం చేయ‌న‌ని ప‌దే ప‌దే చెప్పారు.

మార్పు కోసం చేసే ప్ర‌య‌త్నంలో తా ను ముందు ఉంటానని మ‌రో సారి తెలిపారు. కౌలు రైతు భ‌రోసా యాత్ర సంద‌ర్భంగా క‌డ‌ప జిల్లా , సిద్ధ‌వ‌టం లో బాధిత కుటుంబాల‌తో భేటీ అయ్యారు. వారి గోడు విన్నారు.