Begin typing your search above and press return to search.
ఈసారి జగన్ ఉచ్చులో పవన్ ఫ్యాన్స్ పడలేదు
By: Tupaki Desk | 26 Dec 2022 12:30 AM GMTదేశంలో ఏ హీరోకు లేని హార్డ్ కోర్ ఫ్యాన్ మన పవన్ కళ్యాణ్ కు ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టం. అయితే ఈ ఫ్యాన్స్ అందరూ పవన్ కు ఓటు వేస్తారా? అంటే అదీ లేదు. వాళ్లు ఓటేస్తే పవన్ అంత దారుణంగా ఓడిపోయివారే కాదు.. కానీ పవన్ ను ఏమైనా అంటే మాత్రం ఊరుకోరు ఆ ఫ్యాన్స్. అది హీరో అయినా.. రాజకీయ నేత అయినా సరే ఏకిపారేస్తుంటారు.
అయితే తన ఫ్యాన్స్ అతి విషయంలో చాలా సార్లు చాలా ఇబ్బందులు పడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో 'మీరు ఈలలు గోలలు వేయడం కాదు.. సీఎం సీఎం అంటూ అరవడం .. దీన్నంతా బ్యాలెట్ లో చూపించండి.. ఓటు వేసి గెలిపించండి' అంటూ ఈసడించుకున్నారు. తన ఫ్యాన్స్ ఉద్రిక్తతలను తగ్గించి కంట్రోల్ లో పెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి లేనంతా అభిమానులు జనసేనకు ఉన్నారు. సోషల్ మీడియాలో వీరిది ఒక సైన్యం అని చెప్పొచ్చు. పవన్ ను ఏమైనా అంటే చాలు ఆ హీరోపై, ఆ రాజకీయ నేత, ప్రముఖులపై విరుచుకుపడుతుంటారు. కానీ ఈసారి మాత్రం చాలా తగ్గారు. ఈ తగ్గడం వెనుక జనసేన నేతలు, పవన్ హితబోధ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవల కడప జిల్లా పర్యటనలో సీఎం జగన్ మరోసారి తనకు ఒకటే భార్య అని.. పవన్ కళ్యాణ్ లా నచ్చకపోతే భార్యలను మార్చనని.. ఏపీ ఒక్కటే స్టేట్ తనకు పక్కరాష్ట్రాలు అవసరం లేదంటూ విమర్శించారు. పవన్ పై వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించారు. ఆయన బహు భార్యలను ఎత్తి చూపారు.
సాధారణంగా ఇలా అనగానే పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతుంటారు. కానీ ఈసారి మాత్రం జగన్ ఉచ్చులో పడలేదు. పవన్ వ్యక్తిత్వ హననంపై ఎంత సోషల్ మీడియాలో రచ్చ చేస్తే అంత డ్యామేజ్. అందుకే జగన్ రెచ్చకొట్టాలని చూసినా కూడా పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోలేదు. ఆ జగన్ ప్లాన్ లో పడిపోలేదు.
రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో జనసేన, జనసైనికులు కాస్త తెలివిమీరి లౌక్యం ప్రదర్శిస్తున్నట్టు తాజా సంఘటనలను బట్టి తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.