Begin typing your search above and press return to search.

ఆ జర్నలిస్టులపై జనసైనికుల ట్విట్టర్ ఫైట్

By:  Tupaki Desk   |   25 Dec 2018 11:16 AM IST
ఆ జర్నలిస్టులపై జనసైనికుల ట్విట్టర్ ఫైట్
X
జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల గుర్తుగా ‘గాజు గ్లాస్’ను కేటాయించిన సంగతి తెలిసిందే.. ఈ గుర్తు పై హర్షం వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ టీం దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే జనసేన టీం ‘గాజు గ్లాసు’ వచ్చినందుకు ఎంత ఉత్సాహంగా ముందుకెళ్తుందో.. ఆయన ప్రత్యర్థులు అంతే దూకుడుగా విమర్శలు గుప్పిస్తున్నారు..

తాజాగా పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు ‘గాజు గ్లాస్’పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి హాట్ కామెంట్ చేసింది. అది బీరు గ్లాసా.. వైన్ గ్లాసా.? స్కాచ్ గ్లాసా అంటూ సెటైర్ వేసింది. శ్రీరెడ్డి ఆది నుంచి పవన్ కు వ్యతిరేకమే కావడంతో ఆమె ఆరోపణలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. జనసైనికులు కూడా లైట్ తీసుకున్నారు. అయితే ఇద్దరు దిగ్గజ మీడియా జర్నలిస్టులు తాజాగా గాజు గ్లాస్ గుర్తు పై చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. గౌరవ ప్రదమైన పదవిలో ఉండి వాళ్లు జనసేన పార్టీ గుర్తు పై కామెంట్ చేయడాన్ని జనసైనికులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

సీఎన్ఎన్-ఐబీఎన్ సీనియర్ ఎడిటర్ సతీష్ తాజాగా ‘గాజు గ్లాస్’ గుర్తు పై ట్విట్టర్ లో వెకిలి కామెంట్ పెట్టారు. పవన్ పార్టీకి గ్లాసు కాకుండా చెంబు ఎన్నికల గుర్తుగా ఇవ్వాల్సింది అంటూ కామెంట్ చేశారు. ఇక ‘దిహిందూ’ పత్రిక పొలిటికల్ ఎడిటర్ నిస్టుల హెబ్బర్ అయితే అవహేళన చేసేసింది. ‘జనసేనకు కేటాయించింది పాల గ్లాసా? బీరు గ్లాసా’ అన్నట్టు సింబల్స్ ను ట్విట్టర్ లో పెట్టి ఎద్దేవా చేసింది.

ఈ కామెంట్లకు ఒళ్లు మండిన జనసైనికులు వారిపై ట్విట్టర్ లో యుద్ధం ప్రకటించారు. వారిని విపరీతంగా ట్రోల్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. హిందూ, సీఎన్ఎన్ యాజమాన్యం బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ నిస్టుల మాత్రం తగ్గడం లేదు. జనసేన టీంలో పెయిడ్ మెంబర్లే ఇలా తనను టార్గెట్ చేశారని ఆమె మండిపడుతున్నారు. ఇలా ట్విట్టర్ లో ఇప్పుడు వీరి ఫైట్ రంజుగా సాగుతోంది.