Begin typing your search above and press return to search.
మహర్షి పాట ప్లే చేస్తున్న పవన్ అభిమానులు ? ఎందుకో తెలుసా !
By: Tupaki Desk | 28 April 2022 10:30 AM GMTఒక మనిషి మాట్లాడితే సమస్య తీరిపోతుందా అని ఎవ్వరు అన్నా అందుకు ఎవరో ఒకరు అడ్డు పడతారు. ఎవరో ఒకరు పెదవి విరుస్తారు. ఈ సమాజం నీది ఆ రైతు నీ వాడు .. నీ కుటుంబంలో ఓ భాగం అని ఎవ్వరు చెప్పినా లేదా అరిచినా అదొక వెర్రీ గాలి ఊళ అవుతుంది.లేదా అరుపు అవుతుంది అని రాయాలి. కానీ ఎవ్వరు ఏం అనుకున్నా తనకు తోచిన రీతిలో సాయం చేయాలన్న సంకల్పం నిజంగానే మనిషిని మహర్షిని చేస్తుందని నిరూపించిన ఘటనలు ఎన్నో ! ఓ చోట రాశారు ఇలా.. నను నేను మరిచి ఒంటరనయ్యానే అని ! పవన్ కూడా ఇలానే అనుకుంటారు అని ఆ సినీ కవి రెహ్మాన్ ఎన్నో సార్లు చెప్పారు.
ఒంటరి అయిన ప్రతిసారీ ఆయన గెలిచి వచ్చారు. ఎందరికో ఆదర్శం అయ్యారు. ఎందరికో జీవితం ఇచ్చారు. తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందుకే రైతు కష్టం అంటే తన ఇంటి కష్టం అని తన ఇంటి మనిషి కష్టం అని భావించారు.
ఐదు కోట్ల రూపాయలు అందించేందుకు సిద్ధం అయివ, బాధితులను నేరుగా కలిసేందుకు కౌలు రైతు భరోసా యాత్రను చేపట్టారు. రెండు జిల్లాలలో కలియదిరిగారు. కరువు నేలల్లోనే కాదు సుభిక్షం నడయాడే నేలల్లోనూ కౌలు రైతుల ఆత్మహత్యల కథనాలు చదివి, వారి గోడు విని చలించిపోయి ప్రభుత్వాన్ని కదిలించారు. ఇది మీరు సృష్టించిన సమస్య అనను కానీ,వారిని ఆదుకోండి.. ఇందులో రాజకీయ ప్రమేయం కానీ ప్రయోజనం కానీ ఏమీ లేదు ఉండదు కూడా అని అన్నారు.
ఇవన్నీ వైసీపీ సర్కారును ఆలోచింపజేశాయి. జగన్ ప్రభుత్వం సత్వర చర్యలకు ఉపక్రమించి కౌలు రైతులకు అండగా ఉండాలని భావించి తనవంతు సాయం అందించేందుకు ముందుకు రావడమే ఈ ఉదయం విన్న ఓ శుభ వార్త. థాంక్యూ సీఎం అని మరో సారి చేతులెత్తి మొక్కుతున్న బాధితుల గోడు మరో సారి వినండి సర్..
మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ! అని రాశారు యువ కవి శ్రీమణి. ఇప్పుడీ పాటను ఒకటికి వంద సార్లు వింటున్నారు జనసేన అభిమానులు. తమ చొరవ, తమ ప్రయత్నం ఫలించిన వేళ ఇప్పుడు వారంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమ అధినేత తన తరఫున చేసిన సాయం కారణంగా, ఆయన చూపిన చొరవ కారణంగా జగన్ దిగివచ్చారని, ఇప్పుడాయన ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాల డేటా సేకరిస్తున్నారని ఆధారాలతో సహా చెబుతున్నారు. ఇందుకు వలంటీర్లకు వచ్చిన వాట్సాప్ మెస్సేజ్ లే తార్కాణం అని కూడా అంటున్నారు. దీంతో వీరంతా సీఎంకు ధన్యవాదాలు చెల్లిస్తున్నారు.