Begin typing your search above and press return to search.

రామ్‌ గోపాల్‌ వర్మ కు ఊహించని షాక్‌ ఇచ్చిన పవన్‌ అభిమానులు!

By:  Tupaki Desk   |   11 Jan 2023 6:36 AM GMT
రామ్‌ గోపాల్‌ వర్మ కు ఊహించని షాక్‌ ఇచ్చిన పవన్‌ అభిమానులు!
X
వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన ట్వీట్లతో రచ్చ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా వ్యూహం, శపథం అనే సినిమాలు ఆయన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలను రాయలసీమకు చెందిన వైసీపీ నేత ఒకరు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాల విషయం చర్చించడానికే ఇటీవల రామ్‌ గోపాల్‌ వర్మ గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి సీఎం వైఎస్‌ జగన్‌ తో సమావేశమైన సంగతి తెలిసిందే.

ఇక అప్పటి నుంచి రామ్‌గోపాల్‌ వర్మ మళ్లీ పొలిటికల్‌ కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంపై వర్మ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డబ్బు కోసం తన సొంత కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తున్నాడు అంటూ వర్మ చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపింది. ఈ సందర్భంగా కాపులకు రిప్‌.. కమ్మోళ్లకు కంగ్రాచ్యులేషన్స్‌ అంటూ వర్మ సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు.

వర్మ చేసిన ఈ ట్వీట్‌ పై ఓవైపు కాపు సంఘాలు, టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, పవన్‌ అభిమానులు దుమ్మెత్తి పోశారు. రామ్‌ గోపాల్‌ వర్మపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా వర్మ ఈ విమర్శలకు ఏమీ వెరవలేదు. మళ్లీ మరో వివాదాస్పద ట్వీట్‌ చేశాడు. ''కాపులు - కాపులు ్ఠ కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్‌ నాట్‌ = ఓట్లు'' అంటూ వర్మ మరో ట్వీట్‌తో దుమారం రేపాడు. దీంతో మరోమారు జనసేన, టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు.

ఇక రాంగోపాల్‌ వర్మ ట్వీట్‌ పై రెండు పార్టీల శ్రేణులతో కాపు, కమ్మ సామాజికవర్గాలకు చెందిన తటస్తులు సైతం మండిపడ్డారు. వర్మ చేసిన ట్వీట్లు రెండు కులాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని ధ్వజమెత్తుతున్నారు.

ఇక పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అయితే తీవ్ర చర్యలకు దిగారు. రామ్‌ గోపాల్‌ వర్మ మరణించాడని చెబుతూ అతడికి దశ దిన కర్మ సైతం నిర్వహించారు. ఈ మేరకు రోడ్లపై రామ్‌ గోపాల్‌ వర్మ బ్యానర్లు కట్టి.. వాటికి పూల దండలు వేశారు. ఆ బ్యానర్లపైన వర్మ దశ దిశ కర్మ అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మొదటి ట్వీట్‌ కు వచ్చిన విమర్శలతో ఏమాత్రం వెనక్కి తగ్గని వర్మ ఇప్పుడు తన రెండో ట్వీట్‌ తో పవన్‌ అభిమానులు చేసిన పనితో అయినా వెనక్కి తగ్గుతాడో, లేదో వేచిచూడాల్సిందే.

అయితే తనకు, తన సినిమాలకు ఉచిత ప్రచారం లభిస్తుందనుకుంటే రామ్‌ గోపాల్‌ వర్మ దేనికీ వెనుకాడడు. ఇప్పుడు పవన్‌ అభిమానులు చేసిన పనిని కూడా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తాడని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.