Begin typing your search above and press return to search.

పవన్ మీద ఆ ముద్ర బలంగా.. ?

By:  Tupaki Desk   |   22 Oct 2021 1:30 AM GMT
పవన్ మీద ఆ ముద్ర బలంగా.. ?
X
జనసేనానిగా రాజకీయాల్లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కి అక్కడ ఉన్న అనేక రంగులు సినిమా లోని ఈస్ట్ మన్ కలర్స్ ని మించిపోయి షాకిస్తున్నాయి. పవన్ స్వచ్చంగానే పాలిటిక్స్ లోకి వచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన 2014 మార్చిలో జనసేన పెట్టారు. నాటి పరిస్థితుల నేపధ్యంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. బీజేపీకి తొలిగా మద్దతు ప్రకటించారు. ఆ తరువాత బీజేపీతో టీడీపీ ఏపీలో పొత్తు పెట్టుకుంది. ఈ నేపధ్యంలో రెండు పార్టీలకు పవన్ ఫుల్ సపోర్ట్ చేశారు. అలా 2014లో టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తరువాత టీడీపీ జనసేన బంధం మీద చాలానే ప్రచారం జరిగింది. దానికి పవన్ వ్యవహారశైలి కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి.

ఆయన ప్రశ్నిస్తాను అంటూ వచ్చి అధికారంలో ఉన్న టీడీపీ తప్పులను ఎంచకుండా ప్రతిపక్ష వైసీపీ మీదనే బాణాలు అన్నీ ఎక్కుపెట్టారు. ఇక 2018 నాటికి ఆయన టీడీపీని టార్గెట్ చేసినా ఆ డోస్ అసలు సరిపోలేదు. 2019 ఎన్నికల్లో పవన్ బీఎస్పీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. కానీ దారుణమైన పరాజయం ఎదురైంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దానితో పాటు, పవన్ చంద్రబాబు ఇద్దరూ ఒక్కటే అంటూ వైసీపీ చేసిన ప్రచారం కూడా జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది. దాన్ని పవన్ సహా జనసైనికులు గట్టిగా తిప్పికొట్టలేకపోయారు.

సరే ఆ తరువాత చూస్తే పవన్ బీజేపీతో పొత్తు కలిపారు. ఏపీలో తమ రెండు పార్టీల ఆల్టర్నేషన్ అని చెప్పుకున్నారు. ఎపుడైతే తిరుపతి లోక్ సభ బై పోల్ జరిగిందో నాటి నుంచి పవన్ టీడీపీ బంధం మీద మళ్లీ ప్రచారం స్టార్ట్ అయింది. టీడీపీ కోసమే పవన్ బీజేపీకి పూర్తిగా హెల్ప్ చేయలేదని, ఆయన ఒక్క మీటింగుతో సరిపెట్టేశారని కూడా అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇక లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి కొన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేనల మధ్య సహకారం కూడా బాహాటం అయింది. పరిషత్ ఎన్నికల్లో పరస్పర పొత్తులతో అధికారాన్ని కూడా పంచుకున్నారు కూడా.

దీంతో పవన్ చంద్రబాబు మళ్లీ ఒక్కటే అని వైసీపీ గట్టిగా చెబుతోంది. తాజాగా కొడాలి నాని మాట్లాడుతూ పవన్ని తాము ఎపుడూ వేరుగా చూడడంలేదని, ఆయన చంద్రబాబు పార్టన‌ర్ అని ఘాటైన పదజాలమే వాడారు, ఇతర వైసీపీ మంత్రులు కూడా పవన్ బాబులది ఏనాడూ వీడదీయని బంధం అంటూ చెప్పుకొస్తున్నారు. అసలు వారిద్దరూ విడిపోయింది ఎపుడు అని కూడా నిలదీస్తున్నారు. ఇక వైసీపీ సీనియర్ నేత రామచంద్రయ్య అయితే పవన్ చంద్రబాబుని నమ్మి గుడ్డిగా మద్దతు ఇస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. మొత్తానికి పవన్ చంద్రబాబు ఒక్కటే అన్న ప్రచారం బాగానే జనాల్లోకి పోతోంది.

మరి దీని వల్ల లాభమెవరికీ నష్టమెవరికీ అంటే కచ్చితంగా చంద్రబాబే లాభప‌డతారు అని చెప్పాలి. అదే టైమ్ లో పవన్ సొంతంగా రాజకీయం చేయాలనుకున్నా కుదిరే పని కాదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఒక విధంగా ఈ ప్రచారాన్ని టీడీపీ నేతలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జనసేన‌తో పొత్తు పెట్టుకుంటే తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని కూడా ధీమా పడుతున్నారు. అయితే 2014లో పార్టీ పెట్టిన పవన్ 2024 నాటికి కూడా మద్దతు ఇచ్చే సైనికుడిగానే ఉంటారా అన్నదే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆవేదనగా ఉందిట.

ఇక పవన్ పొలిటికల్ గా ఫ్రంట్ లైన్ లోకి రావాలి అంటే టీడీపీ పొత్తు ఆయనకు అతి పెద్ద బ్రేక్ గానే మారుతుంది అంటున్నారు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే డైరెక్ట్ సీఎం అభ్యర్ధి. అదే టీడీపీ అంటే చంద్రబాబు కానీ లోకేష్ కానీ అక్కడ కనిపిస్తారు. అందువల్ల పవన్ పొలిటికల్ గా సైడ్ క్యారక్టరే కావాల్సి ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి పవన్ టీడీపీతో కలుస్తామని ఈ రోజు దాకా చెప్పలేదు. టీడీపీ బంద్ కి కూడా ఆయన దూరంగా ఉన్నారు. తన పార్టీ కార్యక్రమాలను సొంతంగానే నిర్వహిస్తున్నారు. అయితే జనసేన మీద జరుగుతున్న ఈ ప్రచారం మాత్రం ఆ పార్టీ విస్తరణ అవకాశాలను బాగానే దెబ్బకొడుతోంది అన్న మాట ఉంది. దీని నుంచి బయటపడాలంటే పవన్ చేయాల్సింది చాలానే ఉంది మరి.