Begin typing your search above and press return to search.
అమరావతి రైతులకు షాకిచ్చిన పవన్
By: Tupaki Desk | 11 Jan 2020 6:09 AM GMTజనసేనాని పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు గట్టి షాక్ ఇచ్చారు. వారి కోసం పోరాడుతానని రోడ్డెక్కి నానా యాగి చేసిన పవన్ తాజాగా తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. మీకు న్యాయం జరగడానికి ఏం చేయాలో చెప్పాలని నిస్సహాయంగా రైతులనే అడిగేశారు పవన్ కళ్యాణ్.
అమరావతిలో శుక్రవారం పర్యటించిన పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. తమకు అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకున్న రైతులకు పవన్ షాకిచ్చారు. తానేమీ చేయలేనని.. నిస్సహాయుడినని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ఈ అంశంపైనే చర్చ జరుగుతోందని.. జనసేన పక్షాన తామేం చేయాలో మీరు చెప్పాలని వారితో పవన్ అన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. జనసేన ఉద్యమానికి సలహాలివ్వాలని పవన్ కోరడం అక్కడున్న రైతులను షాక్ కు గురిచేసింది.
రాజధాని రైతులు రోడ్డెక్కడం ఆందోళన చేయడం బాధేస్తోందని.. మరోసారి అలా నష్టపోయే పరిస్థితి రాకూడదని పవన్ అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని.. చట్ట ప్రకారం ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి కూడా బాధ్యత ఉందని పవన్ అన్నారు. వెంటనే కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాజధాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇలా ఎంత ఉద్యమించినా వర్కవుట్ కాలేక పోయేసరికి పవన్ కళ్యాన్ కాడి వదిలేశాడు. ఇక తాను ఏం చేయలేనని అమరావతి రైతులకు షాకిచ్చారు. కేంద్రమే తీర్చాలని ఉచిత సలహా ఇవ్వడం తో రాజధాని రైతులంతా షాక్ కు గురైన పరిస్థితి కనిపిస్తోంది.