Begin typing your search above and press return to search.
చంద్రబాబు మరో సూపర్ ప్లాన్
By: Tupaki Desk | 5 July 2015 4:03 AM GMTతెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెప్పే మాట...నేను సమస్యల్లోనుంచి అవకాశాలు సృష్టించుకుంటాను. మొండిపట్టుతో పనులు పూర్తి చేస్తాను అని. తాజాగా ఆ మాటకు నిలబెట్టుకునేలా తన అనుభవంతో అడుగులు వేస్తున్నారు. ఇందుకో గోదావరి పుష్కరాలను వేదిక చేసుకొని తన సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్తా చాటే విధంగా అడుగులు వేస్తున్నారు.
2003లో ఉమ్మడి రాష్ర్టానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పుష్కరాలు వచ్చాయి. వాటిని విజయవంతంగా నిర్వహించిన చంద్రబాబు...మరోమారు అదే అనుభవంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు... కొత్త సౌకర్యాలు కల్పించేందుకు వేగంగా కృషిచేస్తున్నారు. తాజాగా శాస్ర్తీయ, జానపద, సినీ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు తమ ప్రదర్శనలతో గోదారితీరాన్ని పులకింప చేసేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది.
పుష్కర స్నానానికి వచ్చిన వారు భక్తి భావనతోపాటు మానసిక ఉల్లాసం పొందేలా చంద్రబాబు చేసిన కసరత్తు దాదాపు పూర్తి అయింది. ఈ ఏర్పాట్లలో భాగంగా ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, అలీ సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి నేతృత్వంలో సంగీత విభావరికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనో , శ్రీలేఖల సంగీత విభావరి అలరించనుంది. చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు ప్రవచనాలు ప్రజలకు భక్తిమార్గం ప్రబోధించనున్నాయి. స్వప్నసుందరి కూచిపూడి నృత్యం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ కచేరీ, సుధారఘునాథన్, మల్లాది బ్రదర్స్, ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగం, కద్రి గోపాలనాథ్, సుమతీ రామ్మోహన్‌రావు కచేరీలు గోదావరి తీర వాసులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. కూర్నపాటి ఏడుకొండల డప్పులు, అనూసిన్హా కథక్, ఎ.శేషగిరి యక్షగానం, కట్టా జయలక్ష్మి బుట్టబొమ్మలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.
మరోవైపు చంద్రబాబు సర్కారుకు ఇంకో బంపర్ ఆఫర్ వచ్చింది. పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణగా...రాజమండ్రికి హెలికాప్టర్లు నడిపేందుకు పవన్ హాన్స్ అనే సంస్థ ముందుకు వచ్చింది. బెజవాడ నుంచి రాజమండ్రి పుష్కర ఘాట్లకు నేరుగా హెలికాప్లర్టు నడిపేందుకు ఆ సంస్థ ప్రతినిధులు గన్నవరం విమానాశ్రయ అధికారులతో భేటీ అయ్యారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ) విధానంలో పుష్కరాలకు ప్రత్యేక హెలికాప్టర్లను నడపాలని నిర్ణయించినట్టు చెప్పారు. హెలికాప్టర్లు నడిపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన పవన్ హాన్స్ సంస్థతో గన్నవరం విమానశ్రయ అధికారులు పలు వివరాలు సేకరించారు. రోజుకు ఎన్ని హెలీకాప్టర్ లు నడుపుతారు? ఏ సమయంలో ఉంటాయి? చార్జీ ఎంత? తదితరాలపై చర్చించారు. త్వరలో వీటిపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒకటి రెండ్రోజుల్లో ఈ ప్రక్రియపూర్తయితే...పుష్కర స్నానాన్ని మరింత ఆనందమయంగా పూర్తి చేసుకునే అవకాశం దొరుకుతుంది.
మొత్తంగా ఎగువన ఉన్న మహారాష్ర్టలో వర్షాలు పడకపోవడం వల్ల తెలంగాణ రాష్ర్టం పుష్కరాల నిర్వహణపై ఇబ్బందులు పడుతుంటే..చంద్రబాబు మాత్రం అనుకూలించిన వర్షాలు, కలిసివచ్చిన సందర్భం అండగా తనదైన శలైలిలో ముందుకుపోతున్నారు.