Begin typing your search above and press return to search.
రామానుజాచార్యుల పై పవన్ హాట్ కామెంట్
By: Tupaki Desk | 7 Feb 2022 6:32 AM GMTపవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన ఈ డైలాగ్ వైరల్ అయ్యింది. రామానుజాచార్యులును ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రామానుజాచార్యులు తొలి విప్లవకారుడని జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్న మాట ఇప్పుడు చర్చకు దారితీసింది. ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహాన్ని ఆదివారం పవన్ సందర్శించారు. పవన్ తోపాటు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కీలక ప్రసంగం చేశారు. అణగారిన వర్గాలకు ఆలయ ప్రవేశం లేనప్పుడు వారితో ఆలయ ప్రవేశం చేయించిన గొప్ప విప్లవకారుడు రామానుజాచార్యలుని పవన్ కొనియాడారు. మన మతంలో తప్పు ఒప్పులను ఉంటే ప్రశ్నించే..నిలదీసే హక్కు మనుకుందని తెలిపారన్నారు.
చినజీయర్ స్వామి మహాసంకల్పంతో దేశమంతా తెలిసేలా 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని దివ్యసాకేత క్షేత్రంలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్ లో తాను రామానుజాచార్యుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
రామానుజాచార్యులలోని భక్తి భావాన్ని మాత్రమే అందరూ చూశారు. కానీ ఆయనలోని ఫైర్ ను మాత్రమే చూశాడు పవన్ కల్యాణ్.. ఈ క్రమంలోనే ఆయనను విప్లవకారుడితో పోల్చారు. పవన్ పలికిన డైలాగులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.