Begin typing your search above and press return to search.
పవన్ ప్యాకేజీ స్టార్ అయితే.. ఆ ప్యాకేజీ డబ్బుల లెక్కలేమైనట్లు?
By: Tupaki Desk | 13 Jan 2023 9:30 AM GMTగంభీరమైన ప్రసంగం.. కేరింతలు కొట్టించే పంచ్ డైలాగులు.. ఉద్రేకాన్ని పెంచేలా మాటలకు భిన్నంగా సౌమ్యంగా.. బాధ్యతగా మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లు.. నాలుక చివర నుంచి కాకుండా గుండె లోతుల్లో నుంచి మాట్లాడే రాజకీయ పార్టీ అధినేత తెలుగు నేల మీద ఎవరైనా ఉన్నారా? అంటే.. అదొక్క పవన్ కల్యాణ్ అని మాత్రమే చెప్పక తప్పదు. జనసేన అధినేతగా వ్యవహరిస్తున్న ఆయనకు.. కోట్లాది మందిలో ఆయనకు ఎందుకంత క్రేజ్ అంటే.. ఆయన మాట్లాడే మాటల్లోని నిజాయితీనే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం.. నీతిగా మాట్లాడటం.. ప్రత్యర్థిని ప్రత్యర్థిగా.. శత్రువును శత్రువుగా చూసే లక్షణం పవన్ సొంతం.
సమకాలీన రాజకీయాల్లో మచ్చలేని రాజకీయ నాయకుడు చాలా తక్కువ మంది కనిపిస్తారు. పాలిటిక్స్ లోకి అడుగు పెట్టినంతనే వందల కోట్లు వెనకేసుకునే రాజకీయ నాయకుల్ని ఎంతోమందిని చూస్తున్నాం.
ఆ మాటకు వస్తే రాజకీయాల్లోకి రాక ముందే.. కుటుంబానికి ఉండే పొలిటికల్ పవర్ తో వేలాది కోట్లు సంపాదించినోళ్లు ఉన్నారు. ఆ లెక్కన పవన్ ఎంత సంపాదించి ఉండాలి? ఆయన్ను తరచూ ప్యాకేజీ స్టార్ అంటూ టార్గెట్ చేస్తుంటారు ఏపీ అధికారపక్షం నేతలు. నిజంగానే పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకునే ప్యాకేజీ స్టార్ అయితే.. ఈపాటికి దానికి సంబంధించిన లెక్కల్ని బయటపెట్టటం ఏపీ ప్రభుత్వాధినేతకు పెద్ద కష్టమైన పని కాదు.
మరి.. అలాంటప్పుడు ఆ పనిని ఎందుకు చేయటం లేదు? వైసీపీ ప్రభుత్వం పవర్లోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతుంది. ప్రభుత్వం మీదా.. పాలన మీద పట్టు ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ.. ఆయన అనుంగ అనుచర వర్గం కానీ పవన్ కల్యాణ్ తీసుకున్న ప్యాకేజీలు.. వాటిని ఖర్చు చేసిన లెక్కల్ని.. వెనకేసిన వేలాది కోట్లను ఎక్కడ దాచి పెట్టింది ఎందుకు చెప్పలేకపోతున్నారు.
నిత్యం ప్యాకేజ్ స్టార్ అనేసే పవన్ ను.. ఆయన నిజంగానే ప్యాకేజీ స్టార్ అయి ఉంటే.. అలా వసూలు చేసిన వందలాది కోట్లను ఎక్కడో ఒక దగ్గర దాచి పెట్టి ఉండటమే.. దేన్లో అయినా ఇన్వెస్టు చేసి ఉండటం చేసి ఉంటారు కదా? మరి.. వాటి లెక్కల్ని బయటపెట్టేసి.. నోటికివచ్చినట్లుగా అనేయొచ్చు కదా? కానీ.. అలాంటిదేమీ వైసీపీ సర్కారు ఎందుకు చేయలేకపోతున్నారు?
అదే పవన్ నిజాయితీగా చెప్పాలి. ప్యాకేజీ స్టార్ అన్న మాటల్ని అదే పనిగా వాడేసే ముందు.. దానికి సంబంధించిన సాక్ష్యాల్ని.. ఆధారాల్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది కదా? కానీ.. అలా చేయలేకపోతున్నారంటే.. పవన్ ను ప్యాకేజీ స్టార్ అనే మాటల్లో నిజాయితీ లేకపోవటం.. ఉత్త డొల్లతనం కావటమే కారణమన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.