Begin typing your search above and press return to search.
వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును వదిలేస్తున్న పవన్..!
By: Tupaki Desk | 29 Aug 2022 11:30 PM GMTవచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని .. గట్టిగా నిర్ణయించుకున్నపార్టీ కానీ, నాయకులు కానీ.. ఎలా కష్టపడాలి ? ఏ సందర్భాన్ని ఎలా వినియోగించుకోవాలి ? అంటే.. దీనిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరినీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. అయితే.. ఆ దిశగా.. జనసేన పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును వదిలేది లేదని.. చీలనివ్వబోనని.. పదే పదే చెబుతున్న పవన్.. తాజాగా ఏపీలో జరుగుతున్నపరిణామాలను గమనిస్తే.. వ్యతిరేక ఓటు బ్యాంకును ఆయన వదిలేస్తున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. ప్రస్తుతం ఏపీలో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆవేదన, ఆందోళనలో మునిగిపోయాయి. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో సీఎం జగన్ విఫలమయ్యారంటూ.. వారు ఆందోళన చేస్తున్నారు.
సీపీఎస్ పింఛన్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు.. మిలియన్ మార్చ్‌కు.. సీఎం ఇంటి ముట్టడికి కూడాపి లుపునిచ్చారు. సెప్టెంబరు 1న ఈ రెండు కార్యక్రమాలకు దిగుతున్నట్టు చెప్పారు. అయితే.. దీనిని ప్రభుత్వం అణచి వేస్తోందని.. తమకు నోటీసులు ఇవ్వడంతోపాటు.. ఇప్పుడు బైండోవర్ కేసులు కూడా నమోదు చేస్తున్నారని.. ఉద్యోగులువాపోతున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఎక్కడికక్కడ.. ఉద్యోగులతో లేఖలు రాయించుకుని సంతకాలు చేయించుకుంటున్నారు.
ఇంత తీవ్రమైన పరిస్థితిలో తమకు అండగా ఎవరూ నిలవడంలేదని.. ఉద్యోగులు కొందరు వాపోతున్నా రు. ఇది కూడా నిజమే. ఇంత జరుగుతున్నా.. ఉద్యోగులకు అండగా నిలిచేందుకు జనసేన ఇప్పటి వరకు ముందుకు రాకపోవడం గమనార్హం.
సీపీఎస్ విషయంపై వారు చేసే ఉద్యమానికి తాము మద్దతిస్తు న్నామనే ఒక్క మాట చెబితే.. ఉద్యోగులు ఊపిరి పీల్చుకునే అవకాశం మెండుగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల ఓట్లు కూడా.. జనసేనకు అనుకూలంగా మారుతుంది. కానీ.. ఎందుకో...జనసేన మాత్రం ఆదిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకువేయకపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.