Begin typing your search above and press return to search.

మూడేళ్ల ముచ్చటలో పవన్ చెప్పిందిదే..

By:  Tupaki Desk   |   14 March 2017 12:26 PM GMT
మూడేళ్ల ముచ్చటలో పవన్ చెప్పిందిదే..
X
ప్రశ్నించటం కోసమే పార్టీ పెట్టినట్లుగా చెప్పిన పవన్ కల్యాణ్.. ఎన్ని ప్రశ్నలు వేశారో.. ఎవరిని ప్రశ్నించారో అందరికి తెలిసిందే. తాను స్టార్ట్ చేసిన జనసేన పార్టీ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియా సమావేశాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వెబ్ సైట్ ను ప్రారంభించారు. పార్టీ విధివిధానాల గురించి.. ఆలోచనా ధోరణి తెలియజేసేందుకే వెబ్ సైట్ ప్రారంభించినట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని.. తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లుగా చెప్పిన పవన్.. తాజాగా తమ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీకి సీనియర్ నేతల అవసరం చాలా ఉందని.. అన్న ఆయన ప్రజారాజ్యం సమయంలో సీనియర్లను చేర్చుకునే విషయంలో తాము తీసుకున్ననిర్ణయాల కారణంగా దెబ్బ తిన్నట్లుగా వ్యాఖ్యానించారు. పవన్ ఇంకేం అన్నారంటే..

= 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుంది.

= ప్రజల్లోకి వెళ్లేందుకు 32 అంశాల్నిగుర్తించాం.

= నేను మళ్లీ చెబుతున్నా.. ఎన్డీయేలో భాగస్వామిగా లేను

= అధికారంలో ఉన్న వారిని విమర్శించటమే మా పని కాదు

= జనసేన పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు

= ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటామన్నది ఇప్పుడే చెప్పటం తొందరపాటే అవుతుంది.

= పార్టీ నిర్మాణం పూర్తి అయిన తర్వాత పొత్తుల గురించి ఆలోచిస్తాం

= అధికారంలోకి వచ్చినా.. రాకున్నాప్రజల కోసం పార్టీ పని చేస్తుంది

= పార్టీ ఆలోచనా విధానాన్నిప్రజలకు చెప్పేందుకే వెబ్ సైట్

= నేను ఏ పార్టీకి కొమ్ము కాయను. ప్రజలపక్షాన నిలబడి సమస్యల మీద పోరాడతా.

= ఎన్నికల్లో పార్టీ టికెట్లను 60 శాతం యువతకే ప్రాధాన్యం ఇస్తాం

= యువతకు పెద్ద పీట వేయాలని భావిస్తున్నాం

= పార్టీ అంతిమ లక్ష్యం సమస్యలే కానీ అధికారం ఎంతమాత్రం కాదు

= ఏపీలో ప్రభుత్వ పని తీరును దుయ్యబట్టటం సరికాదు.

= అధికారంలో ఉన్న వారిపై అదే పనిగా విమర్శలు చేయం.

= చిరంజీవి పార్టీలోకి రారు. మా ఇద్దరి ఆలోచనా విధానాలు కలవవు.

= త్వరలో సంగారెడ్డిలో పర్యటిస్తా. అక్కడి కాలుష్యం మీద పలు ఫిర్యాదులు అందుతున్నాయి.

= ప్రజారాజ్యం పార్టీ సమయంలో నేను ఎక్కువగా తెలంగాణలోనే పర్యటించా.

= విమర్శలన్నవి సహేతుకంగా..నిర్మాణాత్మకంగా ఉండేలా చేస్తామే తప్పించి..అదే పనిగా విమర్శలు చేయటం మా పార్టీ విధానం కాదు.

= సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందిస్తా

= మా పార్టీ అంతిమ లక్ష్యం అధికారం ఎంతమాత్రం కాదు.

= డబ్బు ప్రభావం లేని రాజకీయాలు ఉండాలని కోరుకుంటా

= జూన్ నుంచి పార్టీనిర్మాణ కార్యక్రమాల్నిప్రారంభిస్తాం

= పరీక్షల కారణంగా పార్టీ నిర్మాణం కాస్త ఆలస్యం కానుంది. పరీక్షలున్నాయని పలువురి వినతులు ఇవ్వటంతో ఆగాం

= టీడీపీ సర్కారు పథకాలు ప్రజలకు వెళ్లాల్సిన రీతిలో వెళ్లటం లేదు

= యూపీలో కుటుంబ కలహాలవల్లే ఎస్పీ గెలవలేకపోయింది

= సరైన నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు

= సర్వేల్ని నేను పట్టించుకోను. వాటి గురించి ఆలోచించను.

= సంస్థకు రాజకీయ పవర్ ముఖ్యం. అందుకోసం పని చేస్తాం

= నేటి యువతను తక్కువగా అంచనా వేయొద్దు

= ఇరోమ్ షర్మిల ఓటమి బాధ కలిగించింది. ఆమెకు 90 ఓట్లు రావటం బాధాకరం. ఆమెకు మరింత మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేది