Begin typing your search above and press return to search.
మోడీని ఆకాశానికి ఎత్తేసిన పవన్
By: Tupaki Desk | 8 Aug 2022 6:33 AM GMTమిగిలిన స్టార్ సినీ నటులకు భిన్నంగా.. చాలామంది రాజకీయ అధినేతలకు భిన్నంగా వ్యవహరించే కొద్ది మందిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ.. ఎంతో అవసరమైతే తప్ప ఆయన ట్వీట్ చేయరు. అది కూడా ఆచితూచి అన్నట్లుగా చేస్తుంటారు. ఆయన ట్వీట్లలో ఎక్కువగా పంచ్ లే ఉంటాయి. అందుకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెగ పొగిడేసిన తీరు ఆసక్తికరంగా మారింది. గెలిచిన వేళ పొగడ్తలు ఎవరైనా చేస్తారని.. కానీ ఓడిన వేళ.. సంత్రప్తికరమైన ఫలితాన్ని సాధించలేని వేళ దగ్గరకు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా అలాంటి పనే చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన అభినందనలు తెలియజేశారు.
సోషల్ మీడియాలో భారీ పోస్టుతో ప్రధాని మోడీ మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించారు పవన్ కల్యాణ్. తాజాగా కామన్‌వెల్త్ క్రీడా పోటీల్లో మహిళా కుస్తీ పోటీల్లో స్వర్ణం మిస్ అయిన వేళ.. దేశ ప్రజలకు పూజ గెహ్లట్ క్షమాపణలు చెప్పటం.. మీడియా ముందు భోరుమన్న వైనం చాలామందిని కదిలించింది. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆమెను ఓదార్చటమే కాదు.. వేదన చెందటం కాదు వేడుక చేసుకోవాల్సిన సమయం ఇది అంటూ ఊరడిస్తూ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ ఊరడింపు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. వైరల్ గా మారింది. మోడీ వ్యవహరించిన వైనంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రధాని నింపుతున్న స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కలగాలన్న ఆకాంక్షనపు వ్యక్తం చేసి.. గతంలో చంద్రయాన్ 2 ప్రాజెక్టు 2 విఫలమైన వేళ శాస్త్రవేత్తలకు గుండె ధైర్యాన్ని నింపిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ తాజాగా చేసిన పోస్టులో ఏమున్నదన్నది ఆయన మాటల్లోనే చెప్పేస్తే..
''విజయాలు వరించినప్పుడు పొగడ్తలతో ముంచెత్తేవారు కొల్లలుగా ఉంటారు. అదే అపజయం వెంటాడినప్పుడు ఓదార్చేవారు అరుదుగా మాత్రమే కనిపిస్తారు. సన్మానాలు కంటే పరాజయంలో వెన్నంటి ఉన్నవారే గొప్పగా కనపడతారు. ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు చెప్పడం, శుభాకాంక్షలు అందచేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. విజయాలు సాధించిపెట్టడానికి పరితపిస్తూ.. పరిశ్రమిస్తూ... త్రుటిలో విజయానికి దూరమైన వారికి భరోసాగా నిలవడం నన్నెంతో ఆకట్టుకుంది'' అని పేర్కొన్నారు. ఇదే అంశం మీద మరింతగా స్పందిస్తూ..
''బ్రిటన్‌లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడా పోటీలలో మహిళా కుస్తీ పోటీలో పూజ గెహ్లట్ బంగారు పతకం చేజారిపోయి కాంస్యం వచ్చింది. దీంతో దేశానికి బంగారు పతకం అందించలేకపోయానని, దేశ ప్రజలు క్షమించాలంటూ పూజ గెహ్లట్ విలపిస్తున్న వీడియోను మోదీ చూసి ఆమెను ఓదార్చిన తీరు మానవీయంగా ఉంది. "నీ విజయం దేశానికి వేడుకలను తీసుకొచ్చింది.. క్షమాపణలు కాదు. నీ విజయాన్ని చూసి ఉత్తేజితులమయ్యాము... నీ విజయం మాకో అద్భుతం" అని ఆమెకు పంపిన సందేశం కదిలించేలా ఉంది. ఈ సందర్భంలోనే కాదు పలు సంఘటనలలో ఆయన చూపిన ఇటువంటి ఓదార్పు మనసుకు స్వాంతన చేకూరుస్తాయి'' అని ప్రశంసల వర్షం కురిపించారు.
గతంలో వైఫల్యం చెందిన వారిని కూడా ప్రధాని మోడీ ఊరడించారంటూ.. అందుకు సంబంధించిన పాత విషయాల్ని గుర్తు చేసుకున్నారు. ''టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మన దేశ హాకీ మహిళ టీం ఫైనల్ చేరలేదు. మన క్రీడాకారిణులు మైదానంలో విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆ సందర్భంలో ప్రధాని మోడీ మన క్రీడాకారిణులను ఇలాగే ఓదార్చారు. వారికి ఫోన్ చేసి తండ్రిలా అనునయించారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ విఫలమైన సందర్భాల్లోనూ శాస్త్రవేత్తలకు గుండెధైర్యాన్ని నింపారు. ఈ ప్రాజెక్టులోని విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగడంలో విఫలమైనప్పుడు ప్రత్యర్ధులు సోషల్ మీడియా వేదికగా మన శాస్తవేత్తలను గేలి చేశారు..అవమానించారు.
అటువంటి క్లిష్ట సమయంలో ఇస్రో చీఫ్ శ్రీ శివన్‌ను గుండెలకు హత్తుకుని పరాజయాన్ని మరిచిపోండి. భవిష్యత్తుపై దృష్టిపెట్టండని చెప్పి శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడం కుడా మనం మరిచిపోలేని సంఘటన. ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కలగాలని కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నారు. ఒక రాజకీయ నేతలోని గొప్ప గుణాన్ని ప్రస్తావించటం.. ప్రత్యేకంగా ప్రశంసించటం కూడా మామూలు విషయం కాదు. అందుకు పెద్ద మనసు ఉండాలి. సున్నితత్త్వం ఉండాలి. ఆ విషయంలో పవన్ ను కూడా అభినందించాల్సిందే.