Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌..టీడీపీతో పాటు నువ్వూ దోషివే

By:  Tupaki Desk   |   27 Jun 2018 1:30 AM GMT
ప‌వ‌న్‌..టీడీపీతో పాటు నువ్వూ దోషివే
X
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ అడుగుల‌పై ఇప్పుడు హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని అందుకు త‌గిన దూకుడును ప్ర‌ద‌ర్శిస్తూ వివిధ అంశాల‌పై స్పందిస్తున్నారు. అయితే, ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న అధికార టీడీపీని ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే అది కాస్త బూమ‌రాంగ్ అయింద‌ని అంటున్నారు. ఇదంతా ప్ర‌స్తుతం హాట్ హాట్‌ గా సాగుతున్న కడ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ గురించి.

విభ‌జ‌న హామీల విష‌యంలో...అన్యాయం చేశాయ‌ని జ‌న‌సేన - టీడీపీలు ఆరోపిస్తున్న కాంగ్రెస్ - బీజేపీల‌కు ఎంత వాటా ఉందో...ఈ రెండు ప్రాంతీయ పార్టీల‌కు అంతే బాధ్య‌త ఉంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. చ‌ట్టంలో స‌రిగా పొందుప‌ర్చ‌క‌పోవ‌డం కాంగ్రెస్ త‌ప్ప‌యితే..హామీ ఇచ్చిన త‌ర్వాత అమ‌లు చేయ‌క‌పోవ‌డం బీజేపీ త‌ప్పిదం. అదే స‌మ‌యంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ హ‌ఠాత్తుగా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు ఇచ్చిన హామీలు గుర్తుకు రావ‌డం శోచ‌నీయ‌మ‌ని ప‌లువురు అంటున్నారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో అంట‌కాగి టీడీపీ ఎంపీల‌ను మంత్రి ప‌ద‌వుల్లో ఉంచిన టీడీపీ హ‌ఠాత్తుగా ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం గ‌ళం విప్ప‌డం న‌వ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న‌ట్లుగా ఉందంటున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీ త‌మ రాష్ర్టానికి ద‌క్కాల్సిన వాటి విష‌యంలో వ‌రుస‌గా చేసిన ఫాలో అప్‌ లు - ప్ర‌తి కేంద్ర‌మంత్రికి విన‌తి ప‌త్రం ఇవ్వ‌డం వంటివి టీడీపీ మొహ‌మాటానికి కూడా చేయ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు.

క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సైతం బాధ్య‌త తీసుకోవాల్సిన అవ‌సరం ఉంద‌ని అంటున్నారు. 2014లో ఎన్నిక‌ల సంద‌ర్భంగా అనుభ‌వ‌జ్ఞుడ‌ని పేర్కొంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప‌వ‌న్ మ‌ద్ద‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ మ‌ద్ద‌తు తోడ‌వ‌డం వ‌ల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింద‌నేది రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ‌. అలాంటి ప‌వ‌న్ నాలుగేళ్ల త‌ర్వాత బాబు అనుభ‌వం ఎందుకు ప‌నికి రాలేద‌ని `తెలుసుకొని` ఆయ‌న‌కు దూరం అయ్యారు. ప్ర‌శ్నించేందుకు పార్టీ పెట్టాన‌ని వెల్ల‌డించిన నాలుగేళ్ల పాటు రాష్ర్టానికి కేంద్రం నుంచి ద‌క్కాల్సిన వాటి విష‌యంలో ఏం చేశార‌నేది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌. స్థూలంగా రాష్ర్ట ప్ర‌యోజ‌నాల విష‌యంలో టీడీపీ ఎలా సైలెంట్ అయిపోయి అన్యాయం ప‌వ‌న్ అదే చేశార‌నేది మెజార్టీ వ‌ర్గాల మాట‌.