Begin typing your search above and press return to search.
పవన్ క్వాలిఫికేషన్ చెప్పేసిన అఫిడవిట్!
By: Tupaki Desk | 22 March 2019 4:11 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఆసక్తికర అంశాలు తాజాగా బయటకు వచ్చాయి. ఎన్నికల బరిలో నిలిచిన ఆయన తన ఆస్తులు.. అప్పులతో పాటు..తన భార్య.. పిల్లల ఆస్తుల వివరాల్ని వెల్లడించారు. అదే విధంగా తన విద్యార్హత గురించి కూడా ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఆస్తులతో పాటు అప్పలు కూడా భారీగా ఉన్నాయన్న విషయం పవన్ ఎన్నికల అఫిడవిట్ ను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. గాజువాక అసెంబ్లీ స్థానానికి పవన్ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు అంశాలు వెలుగు చూశాయి. ఈ పత్రాల ప్రకారం పవన్ కు ఆస్తులు రూ.52 కోట్లు కాగా.. అప్పులు రూ.33 కోట్లుగా తేలింది. మరో చిత్రమైన విషయం ఏమంటే.. తన రెండో భార్య రేణూదేశాయ్ పిల్లల కంటే కూడా మూడో భార్య అన్నా ఆస్తుల విలువ తక్కువ కావటం. కేవలం రూ.70లక్షలు మాత్రమే ఆమె ఆస్తి విలువగా పేర్కొన్నారు.
అదే సమయంలో. పవన్ - రేణు పిల్లలు అకిరా.. ఆద్య ఆస్తులు దాదాపు రూ.2 కోట్లకు పైనే ఉండటం గమనార్హం. ఇక.. పవన్ దగ్గరి కార్ల లెక్క పెద్దదేనని చెప్పాలి. తనకున్న కార్ల వివరాల్ని ఆయన వెల్లడించారు. ఈ జాబితాలో బెంజ్ ఆర్ క్లాస్ ఆర్350.. వోల్వో ఎక్స్ సీ 90.. మార్లీ డేవిడ్సన్న హెరిటేజ్ సాప్టటైల్.. మహేంద్ర స్కార్ఫియో.. స్కోడా రాపిడ్.. టయోటా ఫార్చునర్ వాహనాలుఉన్నట్లు వెల్లడించారు. 312 గ్రాముల బంగారం.. డైమండ్స్.. ప్లాటినం నగలు ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలోని శంకర్ పల్లి దగ్గర వ్యవసాయ భూమి.. హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో వ్యవసాయేతర భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. పవన్ మొత్తం ఆస్తులు రూ.40.81 కోట్లు కాగా.. అప్పులు రూ.33.72 కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. అఫిడవిట్ లో పేర్కొన్న దాని ప్రకారం పవన్ పదో తరగతి నెల్లూరులోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్లో చదివినట్లు పేర్కొన్నారు. ఇతర చదువుల గురించి ఆయన పేర్కొనలేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఆదాయపన్ను చెల్లింపు విషయంలో పవన్ టాప్ లో నిలుస్తారని చెప్పాలి. 2016-17లో అత్యధికంగా రూ.15.28 కోట్లు చెల్లించగా.. 2017-18లో రూ.9.60 కోట్లు చెల్లించారు. ప్రస్తుతం ఆదాయపన్ను శాఖకు ఆయన రూ.34.42 లక్షలు బాకీ ఉన్నట్లుతేలింది. మిగిలిన రాజకీయ నేతల అఫిడవిట్లకు భిన్నంగా పవన్ ఎన్నికల అఫిడవిట్ ఉందని చెప్పక తప్పదు.