Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ లేకి మాటలకు హద్దే ఉండదా?
By: Tupaki Desk | 9 Dec 2019 2:30 PM GMTగత ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు విషయంలో అప్పుడు తను స్పందించిన తీరుకు, ఇప్పుడు సీఎం జగన్ గురించి తను స్పందిస్తున్న తీరుకు అసలు ఏ మాత్రం పొంతన పెట్టుకోవడం లేదు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. అడ్డగోలుగా మాట్లాడటమే అలవాటుగా చేసుకున్న పవన్ కల్యాణ్… సీఎం జగన్ విషయంలో తన లేకి తనపు మాటలన్ని ఉపయోగిస్తూ ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు పవన్ మాటల నుంచి వినిపిస్తూ ఉన్నాయి.
అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా సీఎం సీట్లో ఉన్న వారు తమ ఇళ్లకు, తమ నిత్యవసరాలకు ప్రభుత్వ ధనాన్నే వాడుకుంటూ ఉంటారు. ఇది దేశంలోని సీఎంలంతా చేసే పనే. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు నాలుగాకులు ఎక్కువ మేశారు.
గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ముతో బోలెడన్ని విలాసాలకు పోయారు. వాటిల్లో విదేశాలకు ప్రైవేట్ జెట్లలో వెళ్లడంతో మొదలుపెడితే - హైదరాబాద్ లో తన ఇంటి రిపేర్లకు, అలాగే తన కుటుంబం హైదరాబాద్ లో స్టార్ హోటళ్లలో బస చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్నే వినియోగించారు.
ఇళ్లు రిపేర్లో ఉందంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడి కుటుంబం హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటళ్లో బస చేసింది. దాని రెంటు కొన్ని లక్షల రూపాయల్లో ఉంటుంది. దానికంతా ఆయన ప్రజాధనాన్ని వాడారు. అలాగే తెలుగుదేశం నేతలు వైద్యానికి అంటూ సింగపూర్ ప్రయాణాలకు వెళ్లి, ప్రజాధనాన్నే వాడుకున్నారు.
కానీ అప్పుడంతా పవన్ స్పందించలేదు. అయితే ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ఇంటి కోసం ప్రభుత్వ ధనాన్ని కేటాయించడం జరిగింది. రిపేర్ల కోసం కొద్ది మొత్తాన్ని కేటాయించారు. అయితే వాటిని సీఎం జగన్ దగ్గరుండి రద్దు చేయించారు. తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రజాధానం అక్కర్లేదని జగన్ స్పష్టం చేశారు. ఆ మేరకు జీవో ఇచ్చారు.
అయితే పవన్ కల్యాణ్ మాత్రం జగన్ ప్రజాధనాన్ని వాడుకున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన విలాసాలకు వెళ్లినా పవన్ మారు మాట్లాడలేదు, అయితే జగన్ జీవోలను రద్దు చేయించినా పవన్ కల్యాణ్ పస లేని ఆరోపణలే చేస్తూ ఉన్నాడు. ఇలా పవన్ కల్యాణ్ తన తీరును తనే బాగా చాటుకుంటున్నాడని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు పై అపారమైన ప్రేమను, జగన్ పై అర్థం లేని కసిని పవన్ కల్యాణ్ చూపిస్తూ ఉన్నాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.