Begin typing your search above and press return to search.
పవన్ సభలో ‘జగన్’ ముచ్చట..?
By: Tupaki Desk | 10 Nov 2016 3:44 AM GMTప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఉద్యమ బరిలోకి దిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విభజన సమయంలో ఏపీకి ఇస్తామని చెప్పిన హోదాను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని.. అందుకోసం ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు అధినేతలు ఎవరికి వారు వారికి తగినట్లుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విశాఖపట్నంలో ‘‘జై ఆంధ్రప్రదేశ్’’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన కోసం తాము కట్టబడి ఉన్నట్లుగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
హోదా కోసం అవసరమైతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన ఆయన.. తన ప్రసంగంలో హోదా సాధన అంశాల కంటే కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేరుకు హోదా సాధన సభ అని చెప్పినా.. జగన్ అసలు లక్ష్యం ఏమిటన్నది తన ప్రసంగం ద్వారా జగన్ స్పష్టం చేశారని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. మరికొద్ది గంటల్లో (సాయంత్రం 4 గంటల సమయంలో) అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన బహిరంగ సభను నిర్వహించనున్నారు. హోదా సాధనలో భాగంగా తొలుత తిరుపతిలో సభ నిర్వహించిన ఆయన.. తర్వాత కాకినాడలో సభ నిర్వహించారు. అనంతరం సభ ఎక్కడ ఉంటుందన్న సందేహం కలిగినా.. దానికి సమాధానం దొరకని పరిస్థితి. ఇలాంటి వేళ.. తన తాజా సభను అనంతపురంలో నిర్వహించాలని పవన్ డిసైడ్ అయ్యారు.
తన ప్రసంగంలో హోదా అవసరాన్ని ఆవేశంగా ప్రస్తావించి కేంద్రం తీరును ఎండగట్టే ఆయన.. మోడీ మీద మాత్రం నేరుగా విమర్శలు చేయలేదు. మోడీపై విమర్శలు చేసే విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరి.. అనంతపురం సభలోనూ అదే విధానాన్ని అనుసరిస్తారా? లేదా? అన్నది ఒక ప్రశ్న. హోదా విషయాన్ని తాను లైట్ తీసుకోవటం లేదని.. ఆ అంశంపై తాను చాలా సీరియస్ గా ఉన్నానన్న విషయాన్ని తన సభలతో స్పష్టం చేస్తున్న పవన్.. అనంతపురం సభలో ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాచిపోయిన లడ్డూలు ఇస్తారా మాకు? అంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని.. మరో కేంద్రమంత్రి.. తెలుగు వాడైన వెంకయ్యనాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పవన్.. ఈసారి ఎవరిని టార్గెట్ చేస్తారన్నది ప్రశ్నగా మారింది.
తన ప్రసంగాల్లో పరోక్షంగా జగన్ ప్రస్తావన తెచ్చే పవన్ కల్యాణ్.. తన మాదిరే హోదా మీద ఉద్యమం చేస్తానని.. హోదాను సాధించే వరకూ వెనక్కి తగ్గేది లేదని ప్రకటించిన జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. హోదా అంశాన్ని పూర్తిగా వదిలేసిన బీజేపీ నేతలు.. వారి బాటలోనే సాగుతున్న ఏపీ అధికారపక్షంపై పవన్ పంచ్ లు ఎలా ఉంటాయన్నది మరికాసేపట్లో తేలనుంది. జగన్ అవినీతి గురించి పరోక్ష వ్యాఖ్యలు చేసే పవన్ కల్యాన్.. తన మాదిరే హోదా సాధన గోదాలో దిగిన ఆయన చెబుతున్న ‘ఎంపీల రాజీనామా’ మాటలపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.
విశాఖ సభలో పవన్ గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక్క వ్యాఖ్య చేయని జగన్ ను.. పవన్ కూడా ప్రస్తావించకుండా వదిలేస్తారా? లేక.. హోదా సాధన విషయంలో ఉద్యమ బాట పడతానన్న ఆయన తీరును.. విశ్వసనీయతను ప్రశ్నించేలా జగన్ ముచ్చట అనంతపురం సభలో ఉంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/