Begin typing your search above and press return to search.

జనసేన హిట్ లిస్ట్ లో అమర్ 

By:  Tupaki Desk   |   14 Jan 2023 12:30 PM GMT
జనసేన హిట్ లిస్ట్ లో అమర్ 
X
వైసీపీ పాలనలో విశాఖ జిల్లాలో ఇద్దరు మంత్రులు మారారు. మొదట్లో భీమిలీ నుంచి ఎన్నికైన అవంతి శ్రీనివాసరావు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలు సమావేశాలు పెట్టి వైసీపీని విమర్శిస్తే వెంటనే మంత్రి అవంతి శ్రీనివాస్ ఇక్కడ అందుకునేవారు. కౌంటర్లు ఇచ్చేవారు.

అయితే అవి డోస్ ఎక్కువగా ఉండేవి కావు. దాంతో అవంతి పనితీరుతో పాటు పవన్ సహా విపక్షాలను ఎదుర్కోవడంతో కొంత ఫెయిల్ అయ్యారన్న కారణం మీద కూడా ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించారు అని అంటారు. అవంతి ప్లేస్ లో తొమ్మి నెలల క్రితం గుడివాడ అమరనాధ్ మంత్రి అయ్యారు.

అయితే అమర్ యువకుడు. మొదటి నుంచి ఆయన దూకుడు మీద ఉంటున్నారు. ముందూ వెనకా చూసుకోకుండా చంద్రబాబు నుంచి ఎవరి మీద అయినా విమర్శలకు వెనకాడడం లేదు. జగన్ కి ఆయన సన్నిహితుడు కావడానికి ఇది కూడా కీలకమైన రీజన్ అని చెబుతారు. అమర్నాథ్ పవన్ మీద అయితే ఒక రేంజిలో కామెంట్స్ చేస్తారు.

ఆయన తండ్రి దివంగత గుడివాడ గురునాధరావు అప్పట్లోనే పంచ్ లకు పెట్టింది పేరు. తండ్రి గుణాలు ఎంతో కొంత అమర్ కి వచ్చాయి. దాంతో అమర్ కూడా పంచ్ డైలాగులు బాగానే పేలుస్తున్నారు. పవన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఏమీ కాకుండా లైట్ తీసుకుంటున్నారు.

పవన్ జస్ట్ ఒక హీరో మాత్రమే రాజకీయ అజ్ఞాని అంటూ అమరనాధ్ పక్కన పెట్టడంతో జనసైనికులు రగిలిపోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ గుడివాడ అమర్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ఎంతలా గుర్తుంచుకోకపోతే పవన్ రణస్థలం సభలో అమర్ మీద డైలాగులు వేస్తారు. అందువల్ల జనసేన టార్గెట్ మారింది అని అంటున్నారు.

జనసేన ఆవిర్భావ సభ దాకా అవంతి మీదనే పవన్ కామెంట్స్ వచ్చారు. బంతీ పూబంతి చామంతీ అంటూ అవంతిని విమర్శించేవారు. ఇపుడు అమర్ మీదనే పవన్ ఫోకస్ పెట్టేశారు. జనసేన హిట్ లిస్ట్ లో అమర్ వచ్చి చేరారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అమర్ ని ఎలాగైనా ఓడించాలని జనసేన పంతం మీద ఉంది.

అమర్ ఐటీ మంత్రిగా విఫలం అయ్యారని, రాజకీయ విమర్శలతో పబ్బం గడుపుకుంటున్నారు అని జనసేన కార్పోరేటర్ మూర్తీ యాదవ్ విమర్శించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి సీట్లో భూ కబ్జాలు చేశారంటూ విమర్శలు దట్టించారు. మూడు పార్టీలు మారిన అమరనాధ్ నీతులు చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. పవన్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆయన అటాక్ చేశారు.

ఇవన్నీ చూస్తూంటే వచ్చే ఎన్నికల్లో అమర్ ఎక్కడ నుంచి పోటీ చేసినా కూడా జనసేన టార్గెట్ చేసి మరీ ఓడించేలా ఉందని అంటున్నారు. అమర్ విషయం తీసుకుంటే అనకాపల్లి నుంచి మళ్లీ పోటీ చేసే సీన్ లేదు. అక్కడ నాన్ లోకల్ ముద్ర వేశారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఫ్యామిలీతో గ్యాప్ ఉంది. ఎలమంచిలిలో పోటీ చేయాలనుకుంటే అక్కడ జనసేన పొత్తులో భాగంగా పోటీకి దిగుతుంది. అలా అమర్ తో డైరెక్ట్ ఫైట్ కి రెడీ గా ఉంది.

అది కాదు సొంత ఊరు ఉన్న గాజువాకకు షిఫ్ట్ అయినా ఆ సీట్లోనూ జనసేన పోటీకి నిలబడుతుంది అంటున్నారు. మొత్తానికి అమర్ ఎక్కడ నుంచి పోటీకి దిగినా జనసేన క్యాండిడేట్ నే ఆయనకు ప్రత్యర్ధిగా ఉంటారని అంటున్నారు. అలా అమర్ ని ఓడించాలన్న కసితో జనసేన ఉంది. మరి ఐటీ మినిస్టర్ గారు పవన్ మీద విమర్శలతో పొద్దు పుచ్చుతారా లేక తన పొలిటికల్ గ్రౌండ్ ఏదో ముందే చూసుకుని స్ట్రాంగ్ చేసుకుంటారా అన్న చర్చ అయితే వస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.