Begin typing your search above and press return to search.
ఏపీలో ఆ రెండు పార్టీల ఇసుక పొత్తు పొడుపు!
By: Tupaki Desk | 2 Nov 2019 1:30 AM GMTఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలకే రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఐదు నెలల క్రితం బద్ద శత్రువులుగా ఎన్నికల క్షేత్రంలో తలపడిన రెండు పార్టీల మధ్య ఇప్పుడు సరికొత్త పొత్తు పొడుపులు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఇసుక అనేది అధికార విపక్షాల మధ్య చిచ్చు పెట్టగలను... కొత్త పొడుపులు పొడిపించగలను... అవసరమైతే పాత మిత్రులను కలవగలను అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను ఇసుక ఓ కుదుపు కుదిపేసింది. జగన్ ఐదు నెలల్లో ఎన్నో సరికొత్త సంస్కరణలతో ఓ మోస్తరు ప్రక్షాళన ప్రారంభించిన మాట వాస్తవం. జగన్ పాలనలో భూతద్దంలో వెతికి చూసినా లోపాలు లేకపోయినా... ఒక్క ఇసుక విషయంలో మాత్రం అందరిలోనూ అసంతృప్తి ఉంది.
కేవలం ఇసుక కొరత అంశాన్నే టాపిక్ గా తీసుకునే విపక్షాలు లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా పవన్ కళ్యాణ్ సైతం ఇసుక కొరత నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో నవంబర్ 3వ తేదీన విశాఖపట్నం వేదికగా లాంగ్ మార్చ్ కు పిలుపు ఇచ్చారు. ఇసుక కొరత అనేది రాష్ట్ర సమస్య అని... ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలోనే పవన్ తన పాత మిత్రులను దగ్గర చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో పవన్ ఏ పార్టీలకు మద్దతు ఇచ్చారో ? ఇప్పుడు అదే పార్టీలను కలుపుకుని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ - టిడిపి అధినేత చంద్రబాబుకు పవన్ ఫోన్ చేసి తన లాంచ్ మార్చ్ లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు బిజెపి హ్యాండ్ ఇచ్చేసింది. అసలు ఇసుక కొరతపై ముందుగా సీఎం జగన్ కు లేఖ రాసింది బిజెపీయే అని.... పవన్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం బీజేపీకి లేదని చెప్పేసింది.
అయితే టీడీపీ మాత్రం పవన్ పోరాటానికి మద్దతు పలికింది. పవన్ లాంగ్ మార్చ్ లో టిడిపి నాయకులు పాల్గొంటారని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో జనసేన ప్రభుత్వంపై చేసే పోరాటాలకు తమ పార్టీ మద్దతు తప్పనిసరిగా ఉంటుందని చంద్రబాబు చేసిన ప్రకటనతో మళ్లీ జనసేన - తెలుగుదేశం పొత్తు చిగురించేలా కనిపిస్తోంది. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్‌ను.... వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని భావించిన చంద్రబాబు... బిజెపితో చెలిమి కోసం తాపత్రయ పడినా ఆ పార్టీ వాళ్లు దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు.
ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీని కాపాడుకోవాలన్నా.... వైసీపీపై ఫైట్ చేయాలన్నా... తమ కేడర్ లో ఆత్మస్థైర్యం నింపాలన్నా జనసేనను కలుపుకోవడమే ఆప్షన్‌గా ఉంది. ఏదేమైనా నిన్నమొన్నటి వరకు శత్రువులగా ఉన్న వపన్ - బాబు సైతం ఇప్పుడు ఇసుక కారణంగా మళ్లీ ఒక్కటయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ ఇద్దరు పాత మిత్రులు మళ్లీ ఒక్కడవుతారేమో ? చూడాలి.