Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌.. నాదెండ్ల‌ను క‌లిపింది అత‌డేనా?

By:  Tupaki Desk   |   17 Oct 2018 7:46 AM GMT
ప‌వ‌న్‌.. నాదెండ్ల‌ను క‌లిపింది అత‌డేనా?
X
జ‌న‌సేన‌లో ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అంశం ఏమైనా ఉందంటే అది మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ప‌వ‌న్ పార్టీలోకి చేర‌టం. సౌమ్యుడిగా.. వివేక‌వంతుడిగా.. ఆలోచ‌నాప‌రుడిగా.. నిజాయితీ ఉన్న నేత‌గా పేరున్న నాదెండ్ల మ‌నోహ‌ర్ ఇంత‌కాలం కాంగ్రెస్‌లోనే సాగి.. ఇప్పుడు జ‌న‌సేన కండువా వేసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

జ‌న‌సేన పార్టీ ఒక సామాజిక వ‌ర్గానికే ప‌రిమిత‌మైంద‌న్న మాట‌ను నాదెండ్ల ఎంట్రీతో కాస్త త‌గ్గింద‌ని చెప్పాలి. రాజ‌కీయంగా చైత‌న్య‌ వంత‌మైన జిల్లాగా పేరున్న గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల జ‌న‌సేన పార్టీలో ఎందుకు చేరారు? ఆయ‌న్ను.. ప‌వ‌న్ కు ద‌గ్గ‌ర‌య్యేలా చేసిందెవ‌రు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

పూర్వ రంగంలో ప‌వ‌న్‌కు.. మ‌నోహ‌ర్‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. ఆ మాట‌కు వ‌స్తే ఇరువురిది వేర్వేరు దారులు. సైద్ధాంతికంగా ఇద్ద‌రి ఆలోచ‌న‌లు కొన్ని క‌లిసినా.. ఎవ‌రికుండే స్టేచ‌ర్ వారికి ఉంది. అలాంటి స‌మ‌యంలో.. మ‌నోహ‌ర్‌కు సంబంధించిన ఫీడ్ బ్యాక్ ప‌వ‌న్ కు ఎవ‌రు ఇచ్చారు. పార్టీలో చేర్చుకోవాల‌న్న స‌ల‌హాతో పాటు.. ప‌వ‌న్ త‌ర‌ఫున నాదెండ్ల వ‌ద్ద‌కు రాయ‌బారాన్ని ఎవ‌రు నిర్వ‌హించారు? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.

గ‌తంలో నాదెండ్ల‌ను అధికార‌.. విపక్ష పార్టీలు రెండూ త‌మ పార్టీలో చేర్చుకోవాల‌న్న ప్ర‌య‌త్నాలు చేశాయి. కానీ.. సాధ్యం కాలేదు. అంద‌రికి సున్నితంగా రాలేన‌ని చెప్పిన మ‌నోహ‌ర్.. అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ జ‌న‌సేనలో చేర‌టం వెనుక అస‌లు కార‌ణం వేరుని అంటున్నారు.

ప‌వ‌న్‌కు.. నాదెండ్ల‌కు కామ‌న్ గా తెలిసిన పారిశ్రామికవేత్త వీరిని క‌లిపిన‌ట్లుగా చెబుతున్నారు. విజ‌య‌వాడ‌కు చెందిన స‌ద‌రు పారిశ్రామివేత్త మాట‌కు ప‌వ‌న్ ప్ర‌యారిటీ ఇస్తార‌ని.. ఆయ‌న ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటు.. ప‌వ‌న్ త‌న వ‌ర్గం చేత చేయించుకున్న క్రాస్ చెక్ రిజ‌ల్ట్ ఓకే అని రావ‌టంతో ఆయ‌న ఇంకేమీ ఆలోచించ‌కుండా పార్టీలోకి ఆహ్వానించార‌ని చెబుతారు. పార్టీలో నాదెండ్ల‌కు ఏ స్థానాన్ని ఇవ్వ‌నున్నారు? అన్న‌ది ఇప్పుడు బ‌య‌ట‌కు రాకున్నా.. గౌర‌వ‌నీయ స్థాన‌మే ద‌క్కుతుంద‌ని చెబుతున్నారు.

ఇందుకు నిద‌ర్శ‌నంగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నిర్వ‌హించిన క‌వాతులో ప‌వ‌న్ త‌న ప‌క్క‌నే నాదెండ్ల మ‌నోహ‌ర్ ను ఉంచుకోవ‌ట‌మే కాదు.. ఆయ‌న్ను ప్ర‌స్తావిస్తూ మాట్లాడిన తీరు చూస్తే.. పార్టీలో ఆయ‌న రోల్ కీ అవుతుంద‌న్న మాట వినిపిస్తోంది. వైఎస్ హ‌యాంలో నాదెండ్ల మ‌నోహ‌ర్ తొలిసారి తెనాలి నుంచి విజ‌యం సాధించారు. 2014 ముందు అసెంబ్లీ స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన మ‌నోహ‌ర్‌.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏర్ప‌డిన ప‌రిణామాల‌కు ప్ర‌త్య‌క్ష సాక్షిగా చెబుతారు. 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోతాన‌ని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత నుంచి మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడా సైలెన్స్ ను బ్రేక్ చేస్తూ జ‌న‌సేన‌లోకి ఎంట్రీ ఇచ్చారు.మ‌రి.. రానున్న రోజుల్లో నాదెండ్ల ఎలాంటి ముద్ర‌ను ప్ర‌ద‌ర్శిస్తారో చూడాలి.