Begin typing your search above and press return to search.
వైసీపీకి ఓటేసి జనసేనకు సలహా చెబితే కోపం రాదా?
By: Tupaki Desk | 11 Jun 2019 4:14 AM GMTతనకు సలహా చెప్పేందుకు వచ్చిన అభిమానిపై జనసేనాని పవన్ కల్యాణ్ రుసరుసలాడారని, అయినా సలహాలిస్తేనే ఇలా కోపం కట్టలు తెంచేసుకుని ఎగిరెగిరి పడతారా? అంటూ ఆయనపై ఇప్పుడు పెద్ద ఎత్తున విశ్లేషణలు మొదలయ్యాయి. అయినా అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా పవన్ చిర్రుబుర్రులాడిన విషయాన్నే హైలెట్ చేస్తూ దాదాపుగా అన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయన్న వాదన కూడా లేకపోలేదు. అసలు పవన్ కల్యాణ్ కు కోపం కట్టలు తెంచుకుందా? పోనీ తెంచుకుంటే అందుకు గల కారణాలేమిటన్న విషయంపై కనీసం ఆరా కూడా తీయకుండానే వ్యతిరేక వార్తలు రాసిన వైనం నిజంగానే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
సరే... జరిగే నష్టం ఎలాగూ జరిగే పోతుంటుంది. అయితే కాస్త ఆసల్యమైనా అసలు విషయం బయటకు వస్తే... విమర్శించిన నోళ్లే మళ్లీ కారణాలు చెప్పి తీరాలి కదా. సరే పవన్ కోపానికి గల కారణం ఏమిటన్న విషయానికి వస్తే... తన పార్టీ ఓటమికి గల కారణాలను, ఎన్నికల్లో తాము చేసిన తప్పులను పవన్ క్రమంగా బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ సమీక్షా సమావేశానికి వచ్చిన ఓ అభిమాని... పార్టీని ఎలా నడపాలన్న విషయంపై పవన్ కే సలహా ఇచ్చే యత్నం చేశారట. సదరు సలహాను సావదానంగానే విన్న పవన్... అసలు ఎన్నికల్లో నీ ఓటు ఎవరికి వేశారు? అంటూ సదరు అబిమానిని ప్రశ్నిస్తే... తన ఓటును వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి వేశానని చెప్పాడట.
దీంతో కాస్తంత ఆగ్రహం తెచ్చుకున్న పవన్... మా పార్టీకి ఓటేయని నీవు, మా పార్టీ ఎలా నడపాలో సలహాలిస్తావా? అంటూ ప్రశ్నించారట. అంతేకాకుండా జనసేనకు ఓటేసిన వారంతా ఇలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి... తాము జనసేనకు ఓటేశామని చెప్పే ధైర్యం ఉందా? అంటూ కూడా ఆయన ప్రశ్నించారట. ఈ వాదననే పవన్ కాస్తంత గట్టిగా వినిపించారని, అయితే అసలు విషయాన్ని మరిచిన మీడియా కేవలం పవన్ అరుపులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పవన్ ఫైరయ్యాంటూ విమర్శనాత్మక కథనాలు రాసిందట.