Begin typing your search above and press return to search.
లై డిటెక్టర్ తో నన్ను టెస్ట్ చేస్కోండి: పవన్
By: Tupaki Desk | 22 Nov 2018 12:38 PM ISTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో జన సేనాని పవన్ కల్యాణ్ రహస్యంగా భేటీ అయ్యారు. వైసీపీతో జనసేన పొత్తు కుదుర్చుకుంది. ఆ రెండు పార్టీలకు బీజేపీ అండ ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా వినిపిస్తున్న ప్రచారమిది. ముఖ్యంగా టీడీపీ నేతల నోటి నుంచి పదేపదే వస్తున్న ఈ మాటలకు - వాటిపై మీడియా సంధిస్తున్న ప్రశ్నలకు గతంలోనే పవన్ క్లారిటీ ఇచ్చేశారు. తమకు వైసీపీతో పొత్తు లేదని తేల్చిచెప్పేశారు. అయినప్పటికీ ఆ రెండు పార్టీల మధ్య సయోధ్యకు సంబంధించిన వార్తలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.
తాజాగా చెన్నైలోనూ పవన్ కు వైసీపీతో పొత్తుకు సంబంధించిన ప్రశ్నే విలేకరుల నుంచి ఎదురైంది. దీంతో పవన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తమకు జగన్ తో పొత్తు లేదని గతంలోనే క్లారిటీ ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. మళ్లీ మళ్లీ చెప్తున్నా.. వచ్చే ఎన్నికల్లో మేం స్వతంత్రంగానే పోటీ చేస్తాం అని ఉద్ఘాటించారు. జనసేన ఇతర పార్టీల్లా పొత్తుల కోసం వెంపర్లాడదని స్పష్టం చేశారు. వైసీపీపై తాను తరచుగా విమర్శలు గుప్పిస్తున్న సంగతిని గుర్తుచేశారు. అలాంటి పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటానని ప్రశ్నించారు.
వైసీపీతో పొత్తు ప్రసక్తే లేదన్న తన మాటలు నమ్మబుద్ధి కాకపోతే తనను లై డిటెక్టర్ తో టెస్ట్ చేసుకోవచ్చునని ఉచిత ఆఫర్ కూడా ఇచ్చేశారు పవన్. ఒంటరిగానే బరిలో దిగుతామని పదే పదే చెప్తున్నా పొత్తులపై ప్రశ్నలు ఎదురవుతుండటంతో తీవ్ర అసహనానికి గురయ్యే ఆయన ఇలా లై డిటెక్టర్ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇకనైనా పవన్-జగన్ దోస్తీపై ప్రచారానికి తెరపడుతుందా? లేక యథావిధిగా వార్తలొస్తాయా? తెలియాలంటే వేచి చూడాల్సిందే!